News November 15, 2024

దేవతలు భూమ్మీదికి దిగొచ్చే ‘దేవ్ దీపావళి’ తెలుసా?

image

భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక పౌర్ణమినే ఉత్తరాదిలో దేవ్ దీపావళి అంటారు. వర గర్వంతో చావే రాదని విర్రవీగుతూ సజ్జనులను బాధిస్తున్న త్రిపురాసురులను ఆ పరమశివుడు సంహరించింది ఈరోజే. అందుకే ఆ విశ్వేశ్వరుడి దేహంలో ఒక భాగంగా భావించే కాశీ నగరంలో ఈ పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈసారి గంగాతీరంలో 17లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు దేవతలు భూమికి దిగొస్తారని భక్తుల నమ్మిక.

Similar News

News December 8, 2024

శుభ ముహూర్తం

image

తేది: డిసెంబర్ 08, ఆదివారం
సప్తమి: ఉ.9.44 గంటలకు
శతభిష: సా.4.03 గంటలకు
వర్జ్యం: రా.10.09-11.40 గంటల వరకు
దుర్ముహూర్తం: సా.4.04-4.49 గంటల వరకు

News December 8, 2024

TODAY HEADLINES

image

☛ TG: ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
☛ సంక్రాంతి తర్వాత రైతుభరోసా: సీఎం రేవంత్
☛ తెలంగాణలో(MBNR) మరోసారి భూ ప్రకంపనలు
☛ AP: పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న CM CBN, పవన్ కళ్యాణ్
☛ ఏటా DSC నిర్వహిస్తాం: CM చంద్రబాబు
☛ పవన్‌పై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: విజయసాయిరెడ్డి
☛ 3 రోజుల్లోనే పుష్ప-2కి రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్
☛ అడిలైడ్ టెస్ట్: రెండో ఇన్నింగ్స్‌లో IND 128/5

News December 8, 2024

రష్యా-ఉక్రెయిన్ వార్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి అవకాశాలు కనిపిస్తున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఇంధన ధరల పెరుగుదల, ఆహారం, ద్రవ్యోల్బణం, ఎరువుల కొరత సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. Global Southలోని 125 దేశాల భావాలను భారత్ వినిపిస్తోందని, యూరోపియన్ నేతలు కూడా ఇరుదేశాల‌తో చర్చలు కొనసాగించాలని భారత్‌ను కోరారన్నారు. యుద్ధం కొనసాగింపు కంటే చర్చల వైపు పరిస్థితులు మారుతున్నట్లు చెప్పారు.