News November 22, 2024

హైకోర్ట్ బెంచ్, సింగిల్ బెంచ్ అంటే తెలుసా?

image

హైకోర్ట్ బెంచ్ అంటే హైకోర్టు మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసిన విభాగం/శాఖ. హైకోర్టులో ఒక కేసును ఒక న్యాయమూర్తి విచారిస్తే దాన్ని సింగిల్ బెంచ్ అంటారు. ఇద్దరు జడ్జీలు విచారిస్తే డివిజన్ బెంచ్ అంటారు. ఒకవేళ ముగ్గురు న్యాయమూర్తులు విచారిస్తే దాన్ని ఫుల్ బెంచ్ అంటారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులుంటే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటారు. > SHARE

Similar News

News November 22, 2024

కాపీరైట్ కేసుల్లో గూగుల్-ఒరాకిల్ ప్రత్యేకం

image

కాపీరైట్ కేసుల్లో అతిపెద్దదిగా గూగుల్, ఒరాకిల్ సంస్థల కేసును చెబుతుంటారు. ఆండ్రాయిడ్ అభివృద్ధి చేసేందుకు గూగుల్ తమ 11వేల లైన్ల కోడ్‌ను కాపీ చేసిందని ఒరాకిల్ 9 బిలియన్ డాలర్లకు దావా వేసింది. దీనిని గూగుల్ సైతం న్యాయస్థానం ముందు ఒప్పుకొంది. ఈ కేసు అమెరికా సుప్రీంకోర్టులో దశాబ్దంపాటు కొనసాగగా, న్యాయపోరాటంలో గూగుల్ గెలిచింది. ఒరాకిల్‌కు చెందిన Java APIని ఉపయోగించడం న్యాయమైనదేనని స్పష్టం చేసింది.

News November 22, 2024

నటుడు దర్శన్‌కి వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాధారాలు

image

రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కి వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాధారాలు పోలీసులకు లభించాయి. వాటి ఆధారంగా 1000 పేజీల అదనపు ఛార్జిషీట్‌ను వారు నమోదు చేశారు. కొత్తగా 20 వరకు సాక్ష్యాలు లభించినట్లు అందులో పేర్కొన్నారు. పునీత్ అనే సాక్షి మొబైల్‌ ఫోన్లో ఫొటోలు లభించినట్లు సమాచారం. ఆ ఫొటోలు హత్య జరిగిన చోట దర్శన్ ఉన్న సమయంలో తీసినవిగా తెలుస్తోంది.

News November 22, 2024

మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: ఉక్రెయిన్ మాజీ సైన్యాధికారి

image

మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైందని, ర‌ష్యా మిత్ర‌దేశాలు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొన‌డమే నిదర్శనమని ఉక్రెయిన్ Ex సైన్యాధికారి వలెరీ జలుఝ్నీ అన్నారు. ఉత్త‌ర కొరియా బ‌ల‌గాలు, ఇరాన్ ఆయుధాలను ప్ర‌యోగించి అమాయ‌కుల‌ను ర‌ష్యా హ‌త‌మార్చడం 3వ ప్రపంచ యుద్ధానికి సాక్ష్య‌మ‌న్నారు. నిర్ణయాత్మక చర్యల ద్వారా యుద్ధాన్ని ఇరు దేశాలకే పరిమితం చేయాలని ఉక్రెయిన్ మిత్రపక్షాలను వలెరీ కోరారు.