News November 22, 2024

హైకోర్ట్ బెంచ్, సింగిల్ బెంచ్ అంటే తెలుసా?

image

హైకోర్ట్ బెంచ్ అంటే హైకోర్టు మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసిన విభాగం/శాఖ. హైకోర్టులో ఒక కేసును ఒక న్యాయమూర్తి విచారిస్తే దాన్ని సింగిల్ బెంచ్ అంటారు. ఇద్దరు జడ్జీలు విచారిస్తే డివిజన్ బెంచ్ అంటారు. ఒకవేళ ముగ్గురు న్యాయమూర్తులు విచారిస్తే దాన్ని ఫుల్ బెంచ్ అంటారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులుంటే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటారు. > SHARE

Similar News

News December 4, 2024

ఈ నెల 11న జిల్లాల్లో వైసీపీ నిరసనలు: జగన్

image

AP: ఈ నెల 11న రైతు సమస్యలపై వైసీపీ జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తుందని వైసీపీ చీఫ్ జగన్ తెలిపారు. ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు. కరెంట్ ఛార్జీల బాదుడును నిరసిస్తూ ఈ నెల 27న ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయమై జనవరి 3న కలెక్టర్ల వద్ద నిరసన చేపడుతామని చెప్పారు.

News December 4, 2024

ఇల్లు కట్టుకుంటే రూ.5,00,000.. GOOD NEWS

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం 4 దశల్లో నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు.

News December 4, 2024

పదవీ విరమణ వయసు మార్పుపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మార్పుపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. పౌర సేవల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు తగిన పాలసీ విధానాలను రూపొందించడంలో కేంద్రం నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది.