News November 26, 2024

IPL ఎలా, ఎందుకు మొదలైందో తెలుసా?

image

2007 T20 WCలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడంతో ప్రపంచం మొత్తం మార్మోగిపోయింది. ఈ క్రేజ్ చూసి ఇండియాలోనూ T20 టోర్నీ నిర్వహించాలని అప్పటి BCCI వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోదీ భావించారు. ఈ విషయాన్ని BCCI పెద్దలకు చెప్పారు. అనుకున్నదే తడవుగా టీ20 క్రికెట్ లీగ్ ప్రారంభించారు. అలా 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్‌కు లలిత్ మోదీ ఫస్ట్ కమిషనర్‌.

Similar News

News October 25, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో కీలక భేటీ
* మద్యం దుకాణాల టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్
* త్వరలోనే 14,000 అంగన్‌వాడీ హెల్పర్ల నియామకం
* కర్నూల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సుల్లో ముమ్మర తనిఖీలు
* హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో కొనసాగుతున్న వర్షాలు

News October 25, 2025

మర్రి చెట్టును ఎందుకు పూజించాలి?

image

మర్రిచెట్టు జ్ఞానం, పవిత్రత, సౌభాగ్యానికి నిదర్శనం. దీన్నే వట వృక్షం అని అంటారు. మహా ప్రళయం తర్వాత విష్ణుమూర్తి శిశువుగా ఈ చెట్టు ఆకుపై శయనించడం వల్లే ఆయనకు ‘వటపత్రశాయి’ అనే నామం వచ్చింది. కైలాసంలో శివుడు ఈ వృక్షం నీడనే నివసిస్తాడని చెబుతారు. స్త్రీలు తమ వైవాహిక సౌభాగ్యం కోసం ఈ చెట్టును పూజించి, జ్యేష్ఠ పౌర్ణమిన ‘వటసావిత్రీ వ్రతం’ ఆచరిస్తారు. దీని కింద రుషులు ధ్యానం చేసి, విశ్రాంతి తీసుకుంటారు.

News October 25, 2025

కర్నూలు బస్సు ప్రమాదం.. కారణం ఇదే

image

AP: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీని పోలీసులు ఛేదించారు. శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామిని విచారించి కీలక విషయాలు వెల్లడించారు. ‘బంక్‌లో పెట్రోలు పోయించాక బండిని శివశంకర్ నడిపాడు. బైక్ స్కిడ్ అయ్యి కుడివైపు డివైడర్‌ను ఢీకొట్టింది. శివశంకర్ స్పాట్‌లో చనిపోయాడు. దీంతో గాయపడ్డ ఎర్రిస్వామి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రోడ్డుపై ఉన్న బైక్‌ని బస్సు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది’ అని తెలిపారు.