News September 15, 2024

మీకు తెలుసా: హుస్సేన్ సాగర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?

image

ఆసియాలోనే అతి పెద్ద మానవ నిర్మిత సరస్సుగా ఉన్న హుస్సేన్ సాగర్‌కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? 1562లో సుల్తాన్ కులీ కుతుబ్ షా దాన్ని తవ్వించాడు. ఆయన అల్లుడు హుస్సేన్ షా వలీ పర్యవేక్షణలో పనులు జరిగాయి. దీంతో చెరువును తవ్వే సమయంలో జనాలు దాన్ని హుస్సేన్ చెరువుగా వ్యవహరించేవారు. చివరికి అదే పేరు స్థిరపడింది. ఆ తర్వాత ఇబ్రహీంకు తన పేరిట కూడా చెరువు ఉండాలనిపించి ఇబ్రహీంపట్నం చెరువు తవ్వించాడని కథనం.

Similar News

News December 12, 2025

నేడు మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు

image

TG: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాతలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం సేకరించింది. క్వింటాకు రూ.2,400 చొప్పున అందజేయనుంది. కాగా కేంద్రం సహకరించకపోయినా రైతులు నష్టపోకూడదని తామే పంటను సేకరిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

News December 12, 2025

నితీశ్ హ్యాట్రిక్

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టారు. ఆంధ్రా జట్టుకు ఆడుతున్న ఆయన మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీశారు. మూడో ఓవర్ 4, 5, 6 బంతులకు వరుసగా హర్ష్, హర్‌ప్రీత్ సింగ్, రజత్ పాటీదార్‌లను పెవిలియన్‌కు పంపించారు. కాగా తొలుత ఆంధ్రా 19.1 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ ఆటగాళ్లు తడబడుతున్నారు.

News December 12, 2025

మహిళలకు త్వరలో ఆర్టీసీ స్మార్ట్ కార్డులు!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో మహిళలకు అందించిన ‘సహేలీ’ తరహా కార్డులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఈ కార్డులపై లబ్ధిదారుల ఫొటో, వివరాలు ఉంటాయి. ఈ కార్డులు వస్తే ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం తప్పనుంది.