News September 15, 2024

మీకు తెలుసా: హుస్సేన్ సాగర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?

image

ఆసియాలోనే అతి పెద్ద మానవ నిర్మిత సరస్సుగా ఉన్న హుస్సేన్ సాగర్‌కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? 1562లో సుల్తాన్ కులీ కుతుబ్ షా దాన్ని తవ్వించాడు. ఆయన అల్లుడు హుస్సేన్ షా వలీ పర్యవేక్షణలో పనులు జరిగాయి. దీంతో చెరువును తవ్వే సమయంలో జనాలు దాన్ని హుస్సేన్ చెరువుగా వ్యవహరించేవారు. చివరికి అదే పేరు స్థిరపడింది. ఆ తర్వాత ఇబ్రహీంకు తన పేరిట కూడా చెరువు ఉండాలనిపించి ఇబ్రహీంపట్నం చెరువు తవ్వించాడని కథనం.

Similar News

News July 11, 2025

ఆస్పత్రిలో 2 గంటలున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్!

image

ప్రస్తుతం 2 గంటలు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా క్లెయిమ్ చేస్తున్నాయి. దీనిపై పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ స్పందించారు. ‘గత పదేళ్లలో వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. గతంలో కొన్ని ఆపరేషన్లకు చాలా సమయం పట్టేది. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే 24 గంటలు పెట్టేది. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో 1-2 గంటలే పడుతుంది’ అని పేర్కొన్నారు.

News July 11, 2025

భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్?

image

భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు గిల్ సారథ్యం వహిస్తారని రాసుకొచ్చాయి. అలాగే టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో BCCI చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గిల్ ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

News July 11, 2025

ఇటలీలో భారీగా ఉద్యోగాలు.. ఇండియన్స్‌కు భలే ఛాన్స్

image

2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇటలీలో 1,67,333 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఈ క్రమంలో హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా.