News January 6, 2025

25 లక్షల కంటే ఎక్కువ జీతం పొందుతున్న వారు ఎంతమందో తెలుసా?

image

దేశంలో ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి జీతాలు ఇలా ఉన్నాయి. ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షల జీతం ఉన్నవారు 1.28 కోట్ల మంది. 10L నుంచి 15L వరకు ఉన్నవారు 50 లక్షలు, 15L – 20L జీతం ఉన్నవారు 19L మంది, 20L – 25L వారు 9 లక్షలు, 25 L నుంచి 50 L జీతం పొందుతున్నవారు 13 లక్షల మంది ఉన్నారు. ఇంతకీ మీరు ఏ స్లాబ్‌లో ఉన్నారు

Similar News

News February 1, 2026

‘మహామాఘి’ అంటే తెలుసా?

image

ఏడాదిలో వచ్చే 12 పౌర్ణమిలలో మాఘ పౌర్ణమి అతి పవిత్రమైనది. అందుకే దీనిని ‘మహామాఘి’ అంటారు. ఈరోజున చంద్రుడు మఖ నక్షత్రంతో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఇది హరిహరులకు ప్రీతికరమైన రోజు. ఈ మాసంలో దేవతలందరూ గంగానదిలో నివసిస్తారట. అందుకే నేడు చేసే నదీ స్నానం అనంతమైన పుణ్యఫలాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ పర్వదినం మానవాళికి ఆధ్యాత్మిక శక్తిని, ఆరోగ్యకరమైన జీవనానికి కావలసిన సంకల్పాన్ని అందిస్తుంది.

News February 1, 2026

NABARDలో 162 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>NABARD<<>>లో 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(FEB 3) ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. మెత్తం పోస్టుల్లో APలో 8 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 21 -35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి 21న, మెయిన్ ఎగ్జామ్ ఏప్రిల్ 12న నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.nabard.org

News February 1, 2026

మిల్లర్లు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే వరి రకాలు

image

అత్యధిక దిగుబడి, అధిక బియ్యం నాణ్యత, చీడపీడలను తట్టుకునే కొన్ని వరి రకాలకు మిల్లర్లు, వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సన్నగింజ రకాలైన BPT 5204(సాంబ మషూరి), WGL-44(సిద్ధి), KNM-1638(కూనారం వరి-2) వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అలాగే అతి సన్న రకాలైన RNR 15048(తెలంగాణ సోన), జై శ్రీరామ్, HMT సోన.. దొడ్డు పొడవు గింజ రకాలైన MTU-1010, KNM 118లకు కూడా మంచి ఆదరణ ఉంది.