News December 18, 2024
అశ్విన్ ఆస్తులు ఎన్నో తెలుసా?
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్ ఆస్తి విలువ సుమారు రూ.132 కోట్లు ఉంటుందని అంచనా. భారత జట్టుకు ఆడినందుకు మ్యాచ్ ఫీజు కింద బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.10 కోట్లు తీసుకుంటారు. IPLలో RR తరఫున ఆడిన ఈ లెజెండరీ స్పిన్నర్ సీజన్‌కు రూ.5 కోట్ల చొప్పున అందుకున్నారు. తాజాగా రూ.9.75 కోట్లకు CSK అతణ్ని దక్కించుకుంది. మింత్రా, ఒప్పో, కోకా-కోలా లాంటి పలు బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్నారు.
Similar News
News January 14, 2025
ప్రజలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు: మంత్రి గొట్టిపాటి
AP: రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదంటూ YCP దుష్ప్రచారం చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. ఎప్పుడూ లేనివిధంగా పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడినవారు పండుగకు సొంతూళ్లకు వచ్చారని తెలిపారు. ‘₹6,700 కోట్ల బకాయిల విడుదలకు CM ఆమోదం తెలిపారు. ₹850 కోట్లతో రోడ్లను బాగు చేశాం. రైతులకు 24గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నాం. దీంతో ప్రజలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
News January 14, 2025
వారెన్ బఫెట్ వారసుడిగా హువర్డ్
ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం వారెన్ బఫెట్(94) తన బెర్క్‌షైర్ హత్‌వే కంపెనీకి వారసుడిగా రెండో కొడుకు హోవర్డ్(70)ను ఎంపిక చేశారు. $1 ట్రిలియన్ విలువైన సంస్థకు ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపడతారని తెలిపారు. తనకు ముగ్గురు పిల్లల మీద నమ్మకం ఉందని, హువర్డ్ తన బిడ్డ కాబట్టే అవకాశం లభించిందని పేర్కొన్నారు. హోవర్డ్ 30ఏళ్లకు పైగా కంపెనీ డైరెక్టర్‌గా పనిచేశారు. చదువు పూర్తైనప్పటి నుంచి తండ్రి బాటలో నడుస్తున్నారు.
News January 14, 2025
తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా: వరలక్ష్మి
తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు దివంగత సీఎం జయలలితే స్ఫూర్తి అని, తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందని చెప్పారు. ఆమె తండ్రి శరత్ కుమార్ కూడా AISMKని స్థాపించి తర్వాత బీజేపీలో విలీనం చేశారు. ఇటీవల <<15069754>>త్రిష కూడా<<>> పొలిటికల్ ఎంట్రీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.