News October 24, 2024
పైరసీ వల్ల వినోద రంగానికి ఎంత నష్టమో తెలుసా!
ఇంట్లో కూర్చొని పైరసీ సినిమాలు చూడడం వల్ల గత ఏడాది వినోద పరిశ్రమకు ₹22,400 కోట్ల నష్టం వాటిల్లినట్టు నివేదికలు అంచనా వేశాయి. సగానికి పైగా భారతీయులు అక్రమంగా కంటెంట్‌ను యాక్సెస్ చేస్తున్నారని, అందులో 63% OTT కంటెంట్‌ను వీక్షిస్తున్నారని తేలింది. థియేటర్ల నుంచి ₹13,700 కోట్లు, OTTల నుంచి ₹8,700 కోట్ల విలువైన కంటెంట్ పైరసీ జరిగింది. ఇది కఠిన నిబంధనల అవసరాన్ని నొక్కిచెబుతోంది.
Similar News
News November 13, 2024
STOCK MARKETS: రూ.5లక్షల కోట్లు లాస్
స్టాక్ మార్కెట్లు విలవిల్లాడాయి. నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. FIIలు వెళ్లిపోవడం, రూపాయి బలహీనత, ఇన్‌ఫ్లేషన్ పెరుగుదల ఇన్వెస్టర్లలో నెగటివ్ సెంటిమెంటును పెంచాయి. సెన్సెక్స్ 77,690 (-984), నిఫ్టీ 23,559 (-324) వద్ద క్లోజయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.5లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. ఆటో, మెటల్, PSU బ్యాంకు, రియాల్టి సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. హీరోమోటో, హిందాల్కో, టాటా స్టీల్ టాప్‌లూజర్స్.
News November 13, 2024
రానా సరికొత్త షో!
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ షోలు చేస్తూ హీరో రానా బిజీగా గడుపుతున్నారు. తాజాగా ‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో సరికొత్త ప్రోగ్రామ్‌తో ముందుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 23వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నటీనటులకు సంబంధించి మనకు తెలియని స్టోరీలను ఇందులో తెలియజేస్తారని రానా ట్వీట్ చేశారు. గతంలో ఆయన చేసిన ‘మెక్‌డోవెల్ నంబర్ 1 యారీ’ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
News November 13, 2024
గుజరాత్ బ్యాటింగ్ కోచ్‌గా పార్థివ్ పటేల్
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జీటీ యాజమాన్యం ధ్రువీకరించింది. కాగా పార్థివ్ ప్రస్తుతం కామెంటేటర్, అనలిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఇకపై మైదానంలో దిగనున్నారు. కాగా పార్థివ్ భారత్ తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే 139 ఐపీఎల్ మ్యాచులు ఆడారు.