News September 25, 2024
యక్ష ప్రశ్నలు అన్న పదం ఎలా వచ్చిందో తెలుసా..?
యక్ష ప్రశ్నలు అన్న పదం మహాభారతం నుంచి వచ్చింది. ఓ పని మీద అడవికి వెళ్లిన భీమార్జున నకుల సహదేవులు సరస్సులో నీరు తాగేందుకు యత్నించగా వారిని ఓ యక్షుడు అడ్డుకుంటాడు. తన ప్రశ్నలకు సమాధానం చెబితే నీరు తాగొచ్చని చెబుతాడు. చెప్పలేకపోయిన ఆ నలుగురూ చనిపోతారు. వారి కోసం వెళ్లిన ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పి అన్నదమ్ముల్ని బతికించుకుంటాడు. అప్పటినుంచి యక్షప్రశ్నలన్న పేరు వాడుకలోకి వచ్చింది.
Similar News
News October 11, 2024
కేసీఆర్ 5వేల స్కూళ్లను మూసేశారు: సీఎం
TG: పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ విద్యపై దృష్టి పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతో దాదాపు 5వేల స్కూళ్లను మూసేశారని ఆరోపించారు. పేదలు చదువుకుంటే బానిసలుగా ఉండరనేది కేసీఆర్ ఆలోచన అని మండిపడ్డారు. తాము విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని సీఎం వివరించారు.
News October 11, 2024
Stock Market: నష్టాల్లో ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో 81,381 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 24,964 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన సూచీలు ఏ దశలోనూ Day Highని క్రాస్ చేయలేదు. Trent, Hindalco, Hcl Tech, TechM, Ongc టాప్ గెయినర్స్. TCS, M&M, Icici, Cipla, AdaniEnt టాప్ టూజర్స్. బ్యాంక్, ఆటో, ఫైనాన్స్ సర్వీస్ రంగ షేర్లు నష్టపోయాయి.
News October 11, 2024
రాత్రి 7గంటలకు ముగియనున్న లిక్కర్ షాపుల దరఖాస్తు గడువు
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు ఈరోజు రాత్రితో ముగియనుంది. రాత్రి 7గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు, 12 గంటల్లోపు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశముంది. బ్యాంకు DDలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అప్లై చేసుకోవచ్చు. కాగా నిన్న రాత్రి 8గంటల వరకు 65,629 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో 20 దరఖాస్తులు అమెరికా నుంచి రావడం గమనార్హం. నాన్ రిఫండబుల్ ఫీజు రూపంలో రూ.1312.58 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.