News August 15, 2024

కొరియన్ మహిళల బ్యూటీ సీక్రెట్ తెలుసా?

image

కొరియన్ మహిళలు వయసు పెరిగినా కూడా మెరిసే పాలరాయి శిల్పంలా కనిపిస్తారు. దీనికి కారణం చర్మాన్ని తేమగా ఉంచే క్లీన్స్, టోన్లు, మాయిశ్చరైజ్ చేసే మల్టీ స్టెప్ స్కిన్ కేర్, సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించడమే. పులియబెట్టిన ఆహారం తీసుకోవడం, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటం, కంటి నిండా నిద్ర పోవడం, ఒత్తిడి లేకుండా, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడం వంటివి వారి అందానికి కారణాలుగా ఉన్నాయి.

Similar News

News December 3, 2025

ముగింపు ‘అఖండ-2’ తాండవమేనా!

image

ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం, OG బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్‌లో బడా చిత్రాల్లో ‘అఖండ-2’తో ఈ ఏడాదికి ముగింపు పలకనుంది. సినిమాపై ఉన్న బజ్ కలెక్షన్లపై ఆశలు రేకెత్తిస్తున్నా బాలయ్య మూవీ రికార్డులు సృష్టిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

News December 3, 2025

ధోనీ రూమ్‌లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

image

క్రికెట్‌ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్‌ఫీల్డ్‌లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్‌లో ధోనీ రూమ్‌ అనధికారిక టీమ్ లాంజ్‌లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్‌ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.

News December 3, 2025

సమంతతో పెళ్లిపై రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్!

image

సమంతను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాజ్ నిడిమోరు సోదరి శీతల్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘చంద్రకుండ్‌లో శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. వీరికి మేమంతా అండగా ఉంటాం. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చారు. ‘లవ్ యూ’ అని సామ్ దీనికి రిప్లై ఇచ్చారు.