News August 15, 2024
కొరియన్ మహిళల బ్యూటీ సీక్రెట్ తెలుసా?
కొరియన్ మహిళలు వయసు పెరిగినా కూడా మెరిసే పాలరాయి శిల్పంలా కనిపిస్తారు. దీనికి కారణం చర్మాన్ని తేమగా ఉంచే క్లీన్స్, టోన్లు, మాయిశ్చరైజ్ చేసే మల్టీ స్టెప్ స్కిన్ కేర్, సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించడమే. పులియబెట్టిన ఆహారం తీసుకోవడం, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటం, కంటి నిండా నిద్ర పోవడం, ఒత్తిడి లేకుండా, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడం వంటివి వారి అందానికి కారణాలుగా ఉన్నాయి.
Similar News
News September 9, 2024
ప్రపంచ వారసత్వ కట్టడాలు: భారత్‌లో ఎన్నంటే?
పురాతన కట్టడాలన్నింటినీ UNESCO ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించదు. ఎన్నో ఏళ్లు కృషి చేస్తే తెలంగాణలోని రామప్ప ఆలయానికి ఈ అవకాశం లభించింది. అయితే, అత్యధికంగా UNESCO గుర్తించిన కట్టడాలు ఏ దేశంలో ఉన్నాయో తెలుసా? 60 కట్టడాలతో ప్రథమ స్థానంలో ఇటలీ ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా (59), జర్మనీ (54), ఫ్రాన్స్(53), స్పెయిన్ (50) ఉన్నాయి. 43 ప్రపంచ వారసత్వ కట్టడాలు కలిగి ఉన్న భారతదేశం 6వ స్థానంలో ఉంది.
News September 9, 2024
NTR ‘దేవర’ క్రేజ్ ఇదే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ మూవీ ప్రీబుకింగ్స్‌లో గత రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్‌కు ఇంకా 18 రోజులు ఉండగా, ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ‘దేవర’ నార్త్ అమెరికా బుకింగ్స్‌లో $1Mకు చేరువైంది. రేపు విడుదలయ్యే ట్రైలర్ అంచనాలు పెంచితే ఈ క్రేజ్ మరింత పీక్స్‌కు చేరే ఛాన్సుంది. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.
News September 9, 2024
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత
TG: మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. దీంతో హుటాహుటిన ఆయనను గ్రీన్ ఛానెల్ ద్వారా ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.