News September 6, 2024

వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఏదో తెలుసా?

image

హిట్ సినిమాల గురించి అందరికీ తెలుసు. వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఏంటో తెలుసా? అదే 1999లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘The 13th Warrior’. ₹1,300కోట్ల బడ్జెట్‌తో తీస్తే ₹511కోట్లే వచ్చాయి. జాన్ మెక్‌టైర్నన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాగ్దాదీ యాత్రికుడు అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ పాత్రలో ఆంటోనియో బాండెరాస్ నటించారు. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత మరెవరూ ముస్లింను హీరోగా చూపించే సాహసం చేయరని విమర్శకులు అన్నారు.

Similar News

News October 5, 2024

జెర్రి పడిందన్నది అవాస్తవం.. నమ్మొద్దు: TTD

image

తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ వస్తున్న ఆరోపణల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. అవి అవాస్తవాలని తేల్చిచెప్పింది. ‘వేలాదిమందికి వడ్డించేందుకు ప్రసాదాన్ని తయారుచేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరం. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని టీడీపీ విజ్ఞప్తి చేస్తోంది’ అని ఓ ప్రకటనలో కోరింది.

News October 5, 2024

Exit Polls: బీజేపీకి ప్ర‌తికూల ఫ‌లితాలు

image

JK, హ‌రియాణా ఎన్నిక‌ల్లో BJPకి ప్ర‌తికూల ఫ‌లితాలు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. 90 స్థానాలున్న JKలో BJP సాధించే సీట్లపై సర్వే అంచనాలు. *పీపుల్స్ పల్స్ 23-27 *దైనిక్ భాస్క‌ర్ 20-25 *గ‌లిస్తాన్ News 28-30 *India Today/CVoter 27-32. హరియాణా: పీపుల్స్ పల్స్ 26 *దైనిక్ భాస్కర్ 19-29 *మ్యాట్రిజ్ 18-24 * ధ్రువ్ రీసెర్చ్ 27-32. BJP రెండు చోట్లా మెజారిటీ మార్క్ సాధించలేదని సర్వేలు తేల్చాయి.

News October 5, 2024

రూ.121 కోట్లు పెట్టి నంబర్ ప్లేట్ కొన్నాడు! ఎందుకంటే..

image

అబుదాబికి చెందిన వ్యాపారవేత్త సయీద్ 2008లో సుమారు రూ.121 కోట్లు వెచ్చించి ‘1’ అంకె ఉన్న నంబర్ రిజిస్ట్రేషన్‌ చేయించారు. పిచ్చి పని అంటూ అప్పట్లో విమర్శించిన వారే అది తెలివైన పెట్టుబడి అని ఇప్పుడు చెబుతున్నారు. అందుక్కారణం.. సింగిల్ డిజిట్ ప్లేట్స్ UAEలో మొత్తమ్మీద 63 మాత్రమే ఉన్నాయి. అందులోనూ ‘1’ అనేది అక్కడి శ్రీమంతులకి స్టేటస్ సింబల్. నేడు ఉన్న డిమాండ్‌కి ఆ నంబర్ విలువ రూ. 168కోట్లకు పైమాటే!