News February 18, 2025

ఓంకారేశ్వర చరిత్ర మీకు తెలుసా!

image

మధ్యప్రదేశ్‌లో ఉండే ఓంకారేశ్వర క్షేత్రం నర్మదా నదిఒడ్డున ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో <<15487669>>నాల్గవది<<>>. స్థలపురాణం ప్రకారం.. పూర్వం వింధ్య పర్వతుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతారు. అప్పుడు పర్వతరాజు ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉండేలా వరం కోరుతారు. దీంతో పరమేశ్వరుడు పార్థివాకారంలో అమలేశ్వరుడు, అమరేశ్వరుడు అనే రెండు రూపాల్లో ఇక్కడ వెలిశారు. ఈ రెండు లింగరూపాలను ఒకే జ్యోతిర్లింగంగా భావిస్తారు.

Similar News

News March 17, 2026

ASF: పగటిపూట వీధిదీపాలు వెలిగితే చర్యలు: కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పగటిపూట వీధి దీపాలు వెలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత ఆదేశించారు. చిర్రకుంట, పాడిబండ గ్రామ పంచాయతీల సందర్శనలో పగటిపూట దీపాలు వెలుగుతుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలకు మరమ్మతులు చేపట్టి, నియంత్రణ బోర్డులు బిగించాలని కార్యదర్శులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని జీపీల్లో విద్యుత్ వృధా కాకుండా చూడాలని డీపీఓకు ఫోన్ ద్వారా సూచించారు.

News March 17, 2026

‘ఉడుతా భక్తి’ అంటే ఏమిటి?

image

ఎలాంటి స్వార్థం లేకుండా తమ శక్తి మేరకు చేసే చిన్న సహాయం గురించి చెప్పే సందర్భంలో ‘ఉడుతా భక్తి’ జాతీయాన్ని వాడతారు. ఇది రామాయణం నుంచి పుట్టింది. లంకకు రామసేతు నిర్మాణంలో తాను కూడా భాగం కావాలని ఉడుత భావిస్తుంది. నీటిలో తడుస్తూ ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేస్తుంది. అందుకు రాముడు మెచ్చుకొని ఉడుత మీద నిమరడంతో ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉన్నాయని ఓ నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 17, 2026

వంటింటి చిట్కాలు

image

* నిమ్మజాతి పండ్లు, టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* వంటింట్లో వాడే స్పాంజీలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన చల్లని నీళ్లలో కాసేపు నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు పోతాయి. దుర్వాసన కూడా ఉండదు.
* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రావు.
* తేనె ముద్దగా అయితే, కాసేపు అది ఉన్న సీసాను వేడి నీళ్లలో ఉంచితే సరిపోతుంది.