News August 17, 2024

ధూమపానం మానేసిన 4ఏళ్లకు ఏమవుతుందో తెలుసా?

image

ధూమపానం మానేసిన 20నిమిషాల తర్వాత హృదయ స్పందన రేటు తగ్గుతుంది. 12గంటల తర్వాత రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి సాధారణ స్థితికి వస్తుంది. గుండె వంటి ముఖ్యమైన అవయవాలకు మరింత ఆక్సిజన్‌ సరఫరా అవుతుంది. 1-2 రోజుల తర్వాత తల తిరగడం, కొన్ని సందర్భాల్లో తలనొప్పి ఉన్నా తగ్గిపోతుంది. ధూమపానం మానేసిన 4 సంవత్సరాల తర్వాత ధూమపానం అలవాటు లేని వ్యక్తిలా మీరు మారిపోతారు.

Similar News

News September 17, 2024

బాలాపూర్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులను ఏం చేస్తారో తెలుసా?

image

1994 నుంచి బాలాపూర్ <<14121640>>లడ్డూ<<>> వేలం ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. స్కూల్, రోడ్లు, ఆలయాల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, వరద బాధితులను ఆదుకునేందుకు ఆ నిధులను ఉపయోగించారు. దేని కోసం ఎంత వెచ్చించారో అందరికీ తెలిసేలా బోర్డులను సైతం ఏర్పాటు చేస్తారు. వేలం ద్వారా వచ్చిన డబ్బులతో తమ ఊరి రూపురేఖలు మారిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు.

News September 17, 2024

సీఎం చంద్రబాబుని కలిసిన వైఎస్ సునీత

image

AP: వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దంపతులు సీఎం చంద్రబాబుని కలిశారు. వివేకా హత్య కేసును విచారించిన అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌‌తో పాటు తనపై గత ప్రభుత్వంలో అక్రమ కేసు పెట్టారని సునీత ఆరోపించారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కుట్రపూరితంగా వ్యవహరించారని తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని సునీత కోరారు.

News September 17, 2024

మయన్మార్‌లో ‘యాగీ’ బీభత్సం.. 236 మంది మృతి

image

మయన్మార్‌లో యాగీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనలో 236 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 77 మంది గల్లంతైనట్లు చెప్పారు. అయితే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 6.31 లక్షల మంది వరదలకు ప్రభావితమైనట్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతినడంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లింది.