News August 9, 2024

కనీసం 6 గంటలైనా నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా?

image

రోజంతా అలుపెరగకుండా పనిచేసే మన అవయవాలకు నిద్రపోయినప్పుడే తగినంత విశ్రాంతి దొరుకుతుంది. అందుకే కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘ఆ నిద్ర కూడా లేకపోతే డయాబెటిస్, హృద్రోగాలు, బీపీ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. డిప్రెషన్‌ ముప్పుతో పాటు అకాల మరణం పొంచి ఉంటుంది’ అని నేషనల్ స్లీప్ క్లినిక్ వ్యవస్థాపకుడు డాక్టర్ జేసీ సూరి హెచ్చరిస్తున్నారు.

Similar News

News November 26, 2025

SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

image

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్‌టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

News November 26, 2025

‘కమ్లా పసంద్’ ఓనర్ కోడలు ఆత్మహత్య

image

పాపులర్ పాన్ మసాలా కంపెనీ ‘కమ్లా పసంద్’ ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా(40) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ వసంత్ విహార్‌‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకొని కనిపించారు. దీప్తి గదిలో పోలీసులు సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భర్త హర్‌ప్రీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది. 2010లో దీప్తి-హర్‌ప్రీత్ వివాహం చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.

News November 26, 2025

ప్రీ డయాబెటీస్‌ని ఎలా గుర్తించాలంటే?

image

ప్రీ డ‌యాబెటిస్ అంటే డ‌యాబెటిస్ రావ‌డానికి ముందు స్టేజి. వీరిలో ర‌క్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సినదాని కన్నా కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. ఈ స్టేజిలో జాగ్రత్తలు తీసుకోకపోతే డ‌యాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి మందులు ఇవ్వకుండా ముందు డైట్ పాటించాల‌ని, వ్యాయామం చేయాల‌ని వైద్యులు సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.