News May 7, 2024
‘ఆర్య’లో హీరోగా చేయాల్సింది ఎవరో తెలుసా..!
అల్లు అర్జున్ కెరీర్లో తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆర్య విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమాను తనను దృష్టిలో పెట్టుకుని రాశారని అల్లరి నరేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘100 పర్సంట్ లవ్’ సమయంలో సుకుమార్, నేను కలిశాం. ‘అల్లరి’లో నా నటన నచ్చి ఆర్య కథను నా కోసం రాశానని ఆయన చెప్పారు. ఎవరికి రాసిపెట్టిన కథ వారి దగ్గరకే వెళ్తుంది. ఆర్యగా బన్నీ కంటే ఎవరూ బాగా చేయలేరు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 6, 2025
విడాకుల రూమర్స్.. ‘అతడి’తో ధనశ్రీ ఫొటో వైరల్
క్రికెటర్ చాహల్, భార్య ధనశ్రీ విడాకులు తీసుకోనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఓ ఫొటో SMలో తెగ వైరల్ అవుతోంది. అదే తన ఫ్రెండ్, కొరియోగ్రాఫర్ ప్రతీక్‌తో గతంలో ధనశ్రీ సన్నిహితంగా దిగిన ఫొటో. ఈ పిక్ బయటికొచ్చినప్పుడే అప్పట్లో ధనశ్రీపై చాహల్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఎంత ఫ్రెండ్ అయినా మరీ ఇలా ఉంటారా? అని ప్రశ్నించారు. తాజాగా విడాకుల రూమర్స్ రావడంతో ఆ ఫొటోను మరోసారి వైరల్ చేస్తున్నారు.
News January 6, 2025
ఈనెల 25లోపు రెండో విడత కాటమయ్య కిట్లు: మంత్రి
TG: కల్లు గీత కార్మికులకు రెండో విడతలో భాగంగా 10 వేల కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 25లోపు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి కిట్లు ఇచ్చామని తెలిపారు. గత ఏడాది జులై 14న రంగారెడ్డి (D) లష్కర్ గూడలో సీఎం రేవంత్ కాటమయ్య కిట్ల పంపిణీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
News January 6, 2025
GOOD NEWS చెప్పిన ప్రభుత్వం
TG: ఈ నెల 26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ప్రకారం వ్యవసాయం చేసే భూములకే డబ్బులు అందనున్నాయి. ఈ స్కీం కింద ఏడాదికి ఎకరానికి రూ.12వేలు అందుతాయి.