News March 2, 2025
ఉపవాసం ఖర్జూరతోనే ఎందుకు విరమిస్తారో తెలుసా..?

రంజాన్ మాసంలో ఉపవాసం ఖర్జూరాలతోనే విరమిస్తారు. ఎందుకంటే మహ్మద్ ప్రవక్త తనకెంతో ఇష్టమైన ఖర్జూరతోనే ఉపవాసాన్ని విరమించేవారని ముస్లింలు నమ్ముతారు. ఇస్లామిక్ సంప్రదాయంలో వీటికి అధిక ప్రాధాన్యత ఉంది. డేట్స్‌లో ఉండే హై-ప్రోటీన్ కంటెంట్ శక్తిని తక్షణమే అందిస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గకుండా చేసి, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా సహాయపడతాయి. ఉపవాసంతో నీరసించిన శరీరాన్ని తిరిగి ఉత్తేజమయ్యేలా చేస్తాయి.
Similar News
News March 24, 2025
నాడు మోదీ చెప్పారు.. నేడు అమరావతిలోనూ అదే దోపిడీ: YCP

AP: అమరావతిలో రూ.27,159 కోట్ల విలువైన కాంట్రాక్టులను 3.94-4.34% అధిక ధరకు సొంత మనుషులకు CBN కేటాయించారని YCP ఆరోపించింది. ‘పోలవరాన్ని చంద్రబాబు ATM మాదిరి వాడుకుంటున్నారని మోదీ ఏ క్షణాన అన్నారో కానీ నేడు అమరావతిలోనూ అదే జరుగుతోంది. అప్పు తెచ్చిన డబ్బంతా అమరావతిలో పోసి 59 ప్యాకేజీల పనులను తమవాళ్లకు ఇచ్చుకున్నారు. అందులో కమీషన్లు నొక్కుతూ చంద్రబాబు సంపన్నుడు అవుతున్నారు’ అని ట్వీట్ చేసింది.
News March 24, 2025
ఎలుక వల్ల భారీగా షేర్ల పతనం!

అద్భుతంగా రాణిస్తున్న కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయంటే ఆదాయం తగ్గడమో, ప్రపంచ మార్కెట్ ట్రెండ్లో కారణమని అనుకుంటాం. కానీ జపాన్‌కు చెందిన జెన్షో హోల్డింగ్స్ కో అనే రెస్టారెంట్ చెయిన్ షేర్ విలువ మాత్రం ఎలుక కారణంగా పడిపోయింది. ఆ సంస్థకు చెందిన ఓ శాఖలో కస్టమర్‌కి సూప్‌లో ఎలుక వచ్చింది. అతడి ఫిర్యాదుతో హోటల్‌లో పరిశుభ్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కంపెనీ షేర్లు 7.1శాతం మేర పతనమయ్యాయి.
News March 24, 2025
పార్లమెంటులో ‘ఛావా’ చూడనున్న మోదీ, కేంద్ర మంత్రులు!

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం ‘ఛావా’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాను త్వరలో పార్లమెంటులో ప్రదర్శిస్తారని తెలిసింది. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారని సమాచారం. నటుడు విక్కీ కౌశల్, క్యాస్ట్ అండ్ క్రూ వస్తారని తెలుస్తోంది. స్క్రీనింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.