News September 28, 2024
మీకు తెలుసా? 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు!

1908లో ఇదే రోజు (సెప్టెంబర్ 28) మూసీ నదికి వరదలు వచ్చి హైదరాబాద్‌లో 15,000 మంది మరణించారు. కొన్ని గంటల్లోనే 48 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో మూసీ ఉప్పొంగింది. వందల చెరువుల కట్టలు తెగి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు నగరంలో ప్రవహించింది. అయితే ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని చింత చెట్టును ఎక్కి 150 మంది ప్రాణాలను కాపాడుకున్నారు. 2 రోజులు దానిపైనే ఉండిపోయారు. ఇప్పటికీ ఆ చెట్టు బతికే ఉంది.
Similar News
News July 9, 2025
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం

బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమైన ఆ ఫ్లైట్‌ను తిరిగి పట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News July 9, 2025
MIM నేతల పట్ల మెతక వైఖరి లేదు: హైడ్రా

TG: తాము ఎంఐఎం నేతల పట్ల ఎలాంటి మెతక వైఖరిని అవలంబించట్లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా మొదటి కూల్చివేత ఎంఐఎం నేతలకు సంబంధించిన ఆక్రమణలేనని పేర్కొంది. ఇటీవల కూల్చివేతల్లోనూ HYD చాంద్రాయణగుట్టలోని MIM కార్పోరేటర్లకు చెందిన దుకాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. తాము పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపింది. సామాజిక కారణాలతో <<16969545>>ఫాతిమా కాలేజీ<<>> కూల్చివేతను నిలిపివేశామంది.
News July 9, 2025
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. ABVP ప్రస్థానమిదే!

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 77వ వసంతంలోకి అడుగు పెట్టింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగమైన ఈ సంస్థను 1949 జులై 9న ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ‘రాష్ట్రీయ ఛత్ర దివస్’ (జాతీయ విద్యార్థి దినోత్సవం)గా కార్యకర్తలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులలో జాతీయవాద భావనను పెంపొందించడం, విద్యా సంస్కరణలను ప్రోత్సహించడం, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ABVP పనిచేస్తోంది.