News January 1, 2025
ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?

శారీరక శ్రమ లేకుండా ఒక రోజులో పదిన్నర గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటే హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం 40 శాతం అధికంగా ఉంటుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఇతరులతో పోలిస్తే హృద్రోగ సమస్యలు 54 శాతం ఎక్కువగా ఉంటాయని MIT-హార్వర్డ్ వర్సిటీ అధ్యయనం తెలిపింది. సగటున 62 ఏళ్ల వయసున్న 89,530 మందిపై స్టడీ చేసి ఈ వివరాలను వెల్లడించింది. కనీసం 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఈ ప్రమాదం కాస్త తగ్గుతుందని పేర్కొంది.
Similar News
News November 28, 2025
నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ హౌసింగ్ బ్యాంక్(<
News November 28, 2025
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లక్షణాలు

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మొదట్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కొందరిలో పీరియడ్స్ ఆగిపోవడం, వికారం ఉంటాయి. ఇంట్లో చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫలితాలు ‘పాజిటివ్’ అని వస్తాయి. రక్తస్రావం కావడం, పొత్తికడుపులో నొప్పి రావడం ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా అనుమానించాలి. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉన్నవాళ్లలో, లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశముంటుంది.
News November 28, 2025
అమరావతిలో 15 బ్యాంకులు.. 6541 ఉద్యోగాలు

AP: రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థలు తమ <<18408811>>కార్యాలయాలు<<>> ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందుకోసం రూ.1,328 కోట్లు వెచ్చించనుండగా 6,541 ఉద్యోగాలు రానున్నాయి. సంస్థల జాబితా ఇదే.. APGB, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాబ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, కెనరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, BOB, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, PNB, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI, LIC, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.


