News December 6, 2024
మీ వద్ద రూ.2 వేల నోట్లు ఇంకా ఉన్నాయా!

₹2 వేలు విలువైన నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు RBI ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా 3.46 కోట్ల పెద్ద నోట్లు(₹6,920 Cr) చెలామణిలోనే ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 2023లో ఉపసంహరణ ప్రకటన చేసే నాటికి 17,793 లక్షల నోట్లు చెలామణిలో ఉండగా, 2024 Nov నాటికి 17,447 లక్షల నోట్లు వెనక్కి వచ్చాయంది. RBIకి చెందిన 19 కేంద్రాల్లో వీటిని మార్చుకోవచ్చని, పోస్టు ద్వారా పంపవచ్చని తెలిపింది.
Similar News
News September 16, 2025
ప్రైవేట్ హాస్పిటళ్లపై సీఎం ఆగ్రహం

TG: ఈ రోజు రాత్రి నుంచి <<17723721>>ఆరోగ్యశ్రీ సేవలను బంద్<<>> చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలకు రూ.75 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ప్రతినెలా బెదిరింపులు తంతుగా మారాయని, ఇక నుంచి అలా చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
News September 16, 2025
రూ.1,779 కోట్లు చెల్లించాం.. బంద్ ఆపండి: ఆరోగ్యశ్రీ సీఈవో

TG: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలను ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,779 కోట్లను హాస్పిటళ్లకు చెల్లించామని తెలిపారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు రూ.57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు ₹75 కోట్లు చెల్లించామని వివరించారు.
News September 16, 2025
ఆ విగ్రహం మహావిష్ణువుది కాదు.. శనీశ్వరుడుది: AP FactCheck

AP: తిరుపతి అలిపిరిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉందంటూ YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రచారం అసత్యమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఆ విగ్రహం అసంపూర్ణంగా చెక్కిన శనీశ్వరునిదని స్పష్టం చేసింది. ‘విగ్రహం తయారీలో లోపం కారణంగా శిల్పి పట్టు కన్నయ్య దీనిని ఇక్కడే వదిలేశారు. పదేళ్లుగా ఈ విగ్రహం ఇక్కడే ఉంది. ఇలాంటి పోస్టులను ఎవరూ సోషల్ మీడియాలో షేర్, పోస్ట్ చేయవద్దు’ అని పేర్కొంది.