News January 3, 2025
జీన్స్ ఎక్కువగా ధరిస్తున్నారా?
ట్రెండీగా ఉండేందుకు ఆడ, మగా తేడా లేకుండా జీన్స్ ధరించేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే ఎక్కువగా జీన్స్ ప్యాంట్లు ధరించడం వల్ల చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్‌గా ఉండే జీన్స్‌తో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు వీటిని ధరించకపోవడమే మేలని అంటున్నారు. ఫ్రీగా ఉండే జీన్స్‌ను లేదా కాటన్ జీన్స్‌ను మితంగా వేసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News January 24, 2025
దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఐటీ అధికారులు దిల్ రాజును సాగర్ సొసైటీలోని ఆయన కార్యాలయానికి తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ సోదాలు లేదా పలు అంశాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
News January 24, 2025
క్రికెటర్ల వరుస విడాకులు.. అసలేం జరుగుతోంది!
భారత క్రికెటర్లు విడాకులు తీసుకోవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. కొందరు ప్రొఫెషనల్ కెరీర్లో సక్సెస్ అయినా కుటుంబ వ్యవహారాల్లో ఫెయిల్ అవుతున్నారు. స్పిన్నర్ చాహల్, తన భార్య ధనశ్రీ విడిపోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తన 20ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పేందుకు సిద్ధమైనట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. కాగా ధవన్, షమీ, పాండ్య ఇప్పటికే విడాకులు తీసుకున్నారు.
News January 24, 2025
విలపించిన సంజూ.. కాపాడిన ద్రవిడ్
రాహుల్ ద్రవిడ్ వల్లే సంజూశాంసన్ ఇప్పుడీ స్థాయిలో ఉన్నాడని అతడి తండ్రి విశ్వనాథ్ అన్నారు. KCA అతడి కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆయనే కాపాడారని వెల్లడించారు. ‘ఓసారి నా కొడుకుపై KCA యాక్షన్ తీసుకుంది. అతడి కిట్, సామగ్రి లాక్కుంది. ఆ టైమ్‌లో ద్రవిడ్ కాల్ చేయగానే సంజూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. బాధపడొద్దని చెప్పిన ద్రవిడ్ అతడిని NCAకు తీసుకెళ్లి శిక్షణనిచ్చారు’ అని వివరించారు.