News October 4, 2024

సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నా.. సత్యమేవ జయతే: చంద్రబాబు

image

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘కల్తీ జరిగిందో లేదో దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు సీబీఐ, ఏపీ పోలీసులు, FSSAI అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది. సత్యమేవ జయతే. ఓం నమో వేంకటేశాయ’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 10, 2024

నీతులు వల్లించడం మీకే చెల్లింది: VSR

image

AP: వ్యక్తిత్వ హననం చేస్తూ నీతులు వల్లించడం మీకే చెల్లిందంటూ CM చంద్రబాబుపై YCP ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ‘ప్రధాని మోదీ సతీమణి గారిని బహిరంగంగానే నిందించింది ఎవరు? ప్రధాని తల్లిగారిని ప్రస్తావించింది ఎవరు? YSR కుమార్తెను వేధించేందుకు ఇంటి నుంచి వెబ్‌సైట్లు నడిపింది ఎవరు? వీటికన్నా ముందే సొంత మామను నగ్నంగా చిత్రీకరించింది(కార్టూన్స్‌ని ఉద్దేశించి) ఎవరు?’ అని నిలదీశారు.

News November 10, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి రెండు ట్రైలర్లు?

image

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుంచి రెండు ట్రైలర్లు వస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో చరణ్ లుక్స్, తమన్ బీజీఎంకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీ, కీలక పాత్రలో అంజలి కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.

News November 10, 2024

SALT: 5 మ్యాచుల్లోనే 3 సెంచరీలు బాదేశాడు

image

ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ వెస్టిండీస్‌కు కొరకరాని కొయ్యగా మారారు. ఆ జట్టుపై ఆడిన 5 టీ20ల్లోనే ఏకంగా 3 సెంచరీలు బాదారు. అలాగే ఓ ఫిఫ్టీ కూడా సాధించారు. ఐదు మ్యాచుల్లో కలిపి సాల్ట్ 456 పరుగులు చేశారు. కాగా సాల్ట్ గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడారు. ప్రస్తుతం అతడిని ఆ జట్టు మెగా వేలానికి వదిలేసింది. వేలంలో అతడు ఎంతకు అమ్ముడుపోవచ్చో కామెంట్ చేయండి.