News March 22, 2024
డాక్టర్లు సైతం ఏఐ వాడాల్సిందే: ప్రముఖ సర్జన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య రంగాన్ని దెబ్బతీయొచ్చని ఊహాగానాలు వస్తున్న వేళ ప్రముఖ సర్జన్ డాక్టర్ అతుల్ గవాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వైద్య రంగంలో ఏఐ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఏఐ డాక్టర్లను భర్తీ చేయదు. కానీ ఏఐని ఉపయోగించని డాక్టర్ స్థానంలో ఆ టెక్నాలజీ వాడే మరో డాక్టర్ వస్తారు. ఏఐతో వ్యాధులను ముందస్తుగా గుర్తించడమే కాక మరింత వేగంగా చికిత్స అందించొచ్చు’ అని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2024
వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ తయారీ ఖర్చు పెంచలేదు: రైల్వే శాఖ
కాంట్రాక్టర్ల కోసం వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ తయారీ ఖర్చును కేంద్రం 50% పెంచిందని TMC MP సాకేత్ ట్వీట్ చేశారు. ‘ఉన్నట్టుండి రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కి తగ్గించారు. ఒక్కో ట్రైన్ కాస్ట్‌ను ₹290cr నుంచి ₹436crకు పెంచారు’ అని ఆరోపించారు. దీనిపై రైల్వే శాఖ స్పందిస్తూ ‘రైళ్లను తగ్గించి ఒక్కో రైలుకు కోచ్‌లను 16 నుంచి 24కు పెంచాం. దీని వల్ల కాంట్రాక్టు వాల్యూ తగ్గింది కానీ పెరగలేదు’ అని తెలిపింది.
News September 16, 2024
పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి(PHOTOS)
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
News September 16, 2024
నీరజ్ చోప్రా తాజా ట్వీటుకు మనూ భాకర్ స్పందన ఏంటంటే?
గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా త్వరగా కోలుకోవాలని షూటర్ మనూ భాకర్ ఆకాంక్షించారు. డైమండ్ లీగులో రజతంతో 2024లో ఈ సీజన్‌ను అద్భుతంగా ముగించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సీజన్లో నేనెంతో నేర్చుకున్నాను. నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా నా ఎడమచేతికి ఫ్రాక్చర్ అయినట్టు ఎక్స్‌రే ద్వారా తెలిసింది. మీ సపోర్టుకు థాంక్స్’ అన్న నీరజ్ ట్వీటుకు మను స్పందించడం నెటిజన్లను ఆకర్షించింది.