News February 27, 2025

వేసవిలో ఎక్కువగా గుడ్లు, మామిడి తింటే వేడిచేస్తుందా?

image

రోజుకు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, వేసవిలో ఇలా చేస్తే వేడి చేస్తుందని కొందరు తినడం మానేస్తారు. అలాంటి వారికోసం వైద్యులు కీలక సూచనలు చేశారు. ‘వేసవిలో గుడ్లు, మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందని చాలామంది భావిస్తారు. శక్తినిచ్చే ఏ ఆహారమైనా ఎక్కువ కేలరీస్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి అది అపోహ మాత్రమే. మనం వాటిని భేషుగ్గా తినొచ్చు’ అని సూచిస్తున్నారు.

Similar News

News November 21, 2025

KNR: SU PG ఎగ్జామ్ ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

SU పరిధిలో జరుగనున్న MA, M.SC, MSW, M.COM విభాగాల్లో 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఇందులో భాగంగా అపరాధ రుసుము లేకుండా NOV 29 వరకు, లేట్ ఫీజు రూ.300తో DEC 3 వరకు ఎగ్జామ్ ఫీజ్ చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని లేదా ఆయా కళాశాలను సంప్రదించాలని సూచించారు. SHARE IT.

News November 21, 2025

‘పసిడి’ పంచ్.. ఫైనల్లో గెలిచిన నిఖత్ జరీన్‌‌

image

వరల్డ్ బాక్సింగ్ కప్‌ ఫైనల్లో నిఖత్ జరీన్ విజయం సాధించారు. 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. జువాన్ యి గువో (చైనీస్ తైపీ)పై 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. నిఖత్ గెలుపుతో ఈ టోర్నీలో భారత మహిళలు గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 5కు చేరింది. మొత్తంగా ఈ టోర్నీలో 9 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్‌ను భారత్ సాధించింది.

News November 21, 2025

టుడే టాప్ న్యూస్

image

*పదోసారి బిహార్ CMగా నితీశ్ కుమార్ ప్రమాణం.. పాల్గొన్న PM మోదీ, అమిత్ షా, CM చంద్రబాబు
*అక్రమాస్తుల కేసులో HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన AP మాజీ సీఎం జగన్
* కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీమంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసులు కొట్టేసిన హైకోర్టు
* ఫార్ములా ఈ-రేస్ కేసులో KTRపై ఛార్జ్‌షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి
* పార్టీ ఫిరాయింపు MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి