News March 17, 2025

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి క్యాన్సర్? నిజమిదే!

image

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలకు ఆయన టీమ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. ‘మమ్ముట్టి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. రంజాన్ కావడంతో ఉపవాసం చేస్తున్నారు. అందుకే సినిమా షూటింగ్స్‌నుంచి విరామం తీసుకున్నారు. ప్రచారంలో ఉన్నది పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేసింది. కాగా తన తర్వాతి సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో కలిసి నటించనుండటం విశేషం.

Similar News

News April 24, 2025

ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ కీలక ప్రకటన

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పరిధిలో కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ కీలక ప్రకటన చేశారు. ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఇందులో డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ టీమ్స్ పాల్గొన్నాయని వెల్లడించారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోల సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

News April 24, 2025

ఇది మీ స్థాయి.. ఇక్కడ కూడా కాపీనేనా?

image

ఉగ్రదాడికి కౌంటర్‌గా పాకిస్థాన్‌పై భారత్ నిన్న ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ సైతం అదే దారిలో నడిచింది. వీసాల రద్దు, హైకమిషన్ కార్యాలయంలో దౌత్య సిబ్బంది తగ్గింపు, అట్టారీ వాఘా బోర్డర్ మూసివేత, వాణిజ్య కార్యకలాపాల రద్దు ఇలా ప్రతి దాంట్లోనూ మనల్నే కాపీ కొట్టింది. ఇక 1972లో కుదిరిన షిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

News April 24, 2025

ఉగ్రదాడి ఘటనపై ముగిసిన అఖిలపక్ష భేటీ

image

పహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడి తర్వాత తీసుకున్న చర్యలపై కేంద్రం వివరించింది. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రేపు శ్రీనగర్‌ వెళ్లనున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన అక్కడ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

error: Content is protected !!