News August 26, 2024
వీటిపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: TBJP

TG: ఈ మూడింటిపై చర్యలు తీసుకుంటే హైడ్రా అసలు ఉద్దేశమేంటో తెలుస్తుందని బీజేపీ ట్వీట్ చేసింది.
1.సలకం చెరువులో అక్బరుద్దీన్ ఒవైసీ విద్యాసంస్థలు
2.జన్వాడలోని కేటీఆర్, ఇతర ప్రాంతాల్లోని BRS నేతల ఫామ్‌హౌస్‌లు
3.కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్‌లు
ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించింది.
Similar News
News December 13, 2025
గుమ్మం ముందు కూర్చొని ఈ పనులు చేస్తున్నారా?

ఇంటి గుమ్మంపై కూర్చోవడం, జుట్టు దువ్వడం, తినడం, అడుగు పెట్టడం వంటి పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుందని అంటున్నారు. అలాగే తలుపు దగ్గర ఓ కాలు లోపల, మరో కాలు బయట పెట్టి నిలబడటం కూడా మంచిది కాదని చెబుతున్నారు. గుమ్మాన్ని కూడా దైవంలా భావించాలని, పూజించాలని ఫలితంగా శుభం కలుగుతుందని వివరిస్తున్నారు. SHARE IT
News December 13, 2025
రానున్న 3 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి (D) కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
News December 13, 2025
మన పూర్వ జన్మ సుకృతాలేంటో తెలుసా?

ఋణానుబంధ రూపేణ! పశు పత్ని సుతాలయాః!
ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!!
ఈ శ్లోకం ప్రకారం.. మన జీవితంలో వచ్చే పశువులు, భార్య, కొడుకులు, ఇల్లు.. ఇవన్నీ మన పూర్వ జన్మ సుకృతాలను బట్టి ఏర్పడుతాయి. ఇది కేవలం రుణాబంధం మాత్రమే. రుణం తీరిపోగానే వారు మనల్ని వదిలి వెళ్లిపోతారు. మన అనుకున్నవన్నీ మనకు దూరమవుతాయి. ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మంచి జరిగినా, చెడు జరిగినా మనం బాధ పడకుండా జీవించగలము.


