News August 26, 2024

వీటిపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: TBJP

image

TG: ఈ మూడింటిపై చర్యలు తీసుకుంటే హైడ్రా అసలు ఉద్దేశమేంటో తెలుస్తుందని బీజేపీ ట్వీట్ చేసింది.
1.సలకం చెరువులో అక్బరుద్దీన్ ఒవైసీ విద్యాసంస్థలు
2.జన్వాడలోని కేటీఆర్, ఇతర ప్రాంతాల్లోని BRS నేతల ఫామ్‌హౌస్‌లు
3.కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్‌లు
ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించింది.

Similar News

News September 11, 2024

ఓటీటీలోకి కొత్త సినిమాలు

image

హరీశ్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ రేపటి(సెప్టెంబర్ 12) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. అలాగే చిన్న సినిమాగా విడుదలై హిట్‌గా నిలిచిన ‘ఆయ్’ కూడా రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు విక్రమ్ ‘తంగలాన్’ మూవీ ఈనెల 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

News September 11, 2024

రాష్ట్రంలో 8,915కు చేరిన ఎంబీబీఎస్ సీట్లు

image

TG: రాష్ట్రంలో ఈ ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరగా MBBS సీట్ల సంఖ్య 4,315కు చేరింది. ప్రైవేట్ కాలేజీలతో కలిపి మొత్తంగా ఈ సంఖ్య 8,915గా ఉంది. మరోవైపు కొత్త కాలేజీలకు అనుమతులిచ్చిన కేంద్రానికి, నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌కు వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు.

News September 11, 2024

తుంగభద్ర ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం!

image

కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. 22వ గేటు దిగువన భారీ గొయ్యి ఏర్పడిందని నిపుణుల కమిటీ పేర్కొంది. దీంతో జలాశయం పునాదులకు ప్రమాదమని అధికారులను అప్రమత్తం చేసింది. డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు సరస్సులోకి నీటి కోసం ఏర్పాటు చేసిన తూముల నుంచి లీకేజీ కావడంతో డ్యామ్‌కు ప్రమాదం ఉండొచ్చని సూచించింది. ఇటీవలే డ్యామ్ గేట్ ఊడిపోవడంతో సరిచేసిన సంగతి తెలిసిందే.