News December 3, 2024

గుండు చేయిస్తే జుట్టు మందం అవుతుందా?

image

తలపై జుట్టు పలుచగా ఉంటే గుండు చేయించుకోవడం వల్ల మందంగా మొలుస్తుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. తలపై హెయిర్ సెల్స్ పుట్టుకతోనే ఉంటాయని, గుండు చేయించినంత మాత్రాన వాటి సంఖ్య పెరగదని చెబుతున్నారు. గుండు చేయించడం వల్ల వెంట్రుకలు మాత్రం మందంగా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు. అంతేకానీ తలపై వెంట్రుకలు ఎక్కువవడం సాధ్యం కాదంటున్నారు.

Similar News

News January 18, 2025

ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్!

image

AP: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్ పార్కు ఏర్పాటు కానుంది. ఇందుకోసం పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ నిన్న మంత్రి లోకేశ్ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,800 కోట్ల పెట్టుబడితో 1,200 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే మార్చిలో శంకుస్థాపన చేయనున్నారు. తమ ఫ్యాక్టరీ నుంచి తొలి ఈవీ బైక్ 2026 డిసెంబర్ నాటికి విడుదలవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

News January 18, 2025

త్వరలో 3,260 పోస్టుల భర్తీ!

image

TG: విద్యుత్ శాఖలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. త్వరలోనే 3,260 పోస్టులు భర్తీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్పీడీసీఎల్-వరంగల్‌లో 2,212 జేఎల్ఎం, 30 సబ్ ఇంజినీర్, 18 అసిస్టెంట్ ఇంజినీర్, ఎస్పీడీసీఎల్ లో 600 JLM, 300 సబ్ ఇంజినీర్, 100 AE పోస్టులను భర్తీ చేసే అవకాశముంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.

News January 18, 2025

నేటి నుంచి U19 మహిళల టీ20 WC

image

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మలేషియా వేదికగా ఇవాళ్టి నుంచి జరగనుంది. మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్ గ్రూప్-ఏలో ఉన్నాయి. టీమ్ ఇండియా తన తొలి మ్యాచును రేపు WIతో ఆడనుంది. నేడు తొలి మ్యాచు ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో చూడవచ్చు. 2023లో జరిగిన తొలి ఎడిషన్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.