News May 15, 2024

ఎఫ్ఐఐల ట్రిక్ పనిచేస్తుందా? – 1/2

image

ఎన్నికల ఫలితాలపై విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రతికూల అభిప్రాయంతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి మూడు విడతల్లో తక్కువ పోలింగ్ నమోదు కావడంతో వారి అభిప్రాయం బలపడినట్లు పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు $4 బిలియన్ల షేర్లను విక్రయించారు. మరోవైపు నెట్ షార్ట్ పొజిషన్ల కాంట్రాక్టులు 2,13,224కు చేరాయని, 2012 తర్వాత ఆ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News January 11, 2025

పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్: కొత్త రూల్స్ ఇవే

image

TG: వచ్చే విద్యా సంవత్సరంలో SC విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది.
☛ విద్యార్థుల పేరు ఆధార్, టెన్త్ మెమోలో ఒకేలా ఉండాలి
☛ మీ సేవ కేంద్రాల్లో విద్యార్థులు బయోమెట్రిక్ పూర్తిచేయాలి
☛ తర్వాత ఈ-పాస్‌ <>సైట్‌లో<<>> రిజిస్టర్ చేసుకోవాలి
☛ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి
☛ కాలేజీ యాజమాన్యాలే విద్యార్థుల అప్లికేషన్లను పరిశీలించి అధికారులకు పంపాలి

News January 11, 2025

రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానం: సీఎం

image

TG: రాష్ట్రంలో ‘వన్ స్టేట్-వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలన్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీలోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితాలనూ గ్రామ సభల్లో బహిర్గతం చేయాలని, ఈనెల 24లోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు.

News January 11, 2025

ALERT.. పెరగనున్న చలి తీవ్రత

image

TG: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మరో 4 రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువన నమోదవుతున్నాయని పేర్కొంది. కొమురం భీం(D) తిర్యాణీలో 6.8, ఆదిలాబాద్(D) భీంపూర్‌లో 7, నిర్మల్(D) పెంబీలో 9.1, సంగారెడ్డి(D) న్యాల్‌కల్‌లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.