News September 21, 2024

కుక్కలకు పాండాలుగా రంగులు.. చైనాలో సందర్శకుల ఆగ్రహం

image

పాండాలను చూసేందుకు వచ్చే సందర్శకులను చైనాలో కొన్ని జూలు మోసం చేస్తున్నాయి. తాజాగా షాన్వీ జూలో కుక్కలకు పాండాల్లా రంగులు వేస్తున్నారని ఆరోపిస్తూ ఓ సందర్శకుడు వీడియో తీసి నెట్లో పెట్టారు. తొలుత అవి పాండా డాగ్స్ అనే జాతి అంటూ బుకాయించిన జూ నిర్వాహకులు, తర్వాత ఆరోపణలు నిజమని ఒప్పుకొన్నారు. దీంతో సందర్శకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ డబ్బులు వెనక్కివ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News October 10, 2024

శాంతి, స్థిరత్వంపై ASEAN దేశాలతో చర్చిస్తా: మోదీ

image

ASEAN దేశాలతో భారత్ బంధం మరింత బలపడుతుందని PM మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కోఆపరేషన్ ఫ్యూచర్ దిశ, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అక్కడి లీడర్లతో చర్చిస్తానని చెప్పారు. ASEAN-India, ఈస్ట్ ఏషియా సదస్సుల కోసం ఉదయం ఆయన లావోస్ బయల్దేరారు. ‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు ఈస్ట్ ఏషియా సదస్సు మంచి అవకాశం. లావో PDR నేతలను కలుస్తాను’ అని మోదీ తెలిపారు.

News October 10, 2024

దేవాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి గుడిలో వైదిక కమిటీని నియమించాలంది. నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాలు వంటి అంశాల్లో కమిటీ సూచనలు అధికారులు పాటించాలంది. కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలంది.

News October 10, 2024

సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించం: మంత్రి కొల్లు

image

ఏపీలో మద్యం షాపులను సొంతం చేసుకోవడానికి కొందరు సిండికేట్లుగా ఏర్పడుతున్నారనే ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వొద్దని, రాజకీయ ఒత్తిళ్లు తలొగ్గొద్దని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియ, షాపుల కేటాయింపులు పారదర్శకంగా ఉండాలన్నారు. సిండికేట్లకు సహకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నెల 16నుంచి కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.