News March 22, 2024
బ్యాంకు లావాదేవీలు చేస్తున్నారా?

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఖాతాల నుంచి రూ.లక్ష విత్డ్రా, డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని ఆదేశించింది. ‘ఈ వివరాలను అన్ని బ్యాంకుల నుంచి అధికారులు తెప్పించుకోవాలి. వాటిని విశ్లేషించాలి. ఒకే బ్యాంక్ బ్రాంచి నుంచి వేర్వేరు ఖాతాలకు డబ్బుల బదిలీపై ఫిర్యాదులు వస్తున్నాయి’ అని ఈసీ పేర్కొంది.
Similar News
News April 7, 2025
ట్రంప్ దెబ్బ.. మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిది!

ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత స్టాక్ మార్కెట్లు 3.9%, హాంకాంగ్- 8.7%, సింగపూర్- 7%, జపాన్- 6%, చైనా- 5.5%, మలేషియా- 4.2%, ఆస్ట్రేలియా- 4.1%, ఫిలిప్పీన్స్- 4%, న్యూజిలాండ్-3.6% నష్టపోయాయి. కొన్ని నెలల పాటు ఈ టారిఫ్స్ ఒడుదొడుకులు కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.
News April 7, 2025
ఐటీ నోటీసులకు భయపడం: పృథ్వీరాజ్ తల్లి

రెమ్యునరేషన్ వివరాలు వెల్లడించాలని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్కు ఐటీ నోటీసులు రావడంపై ఆయన తల్లి మల్లిక స్పందించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తునకు భయపడేది లేదని చెప్పారు. అంతకుముందు సినిమా విషయంలో వివాదం చెలరేగగా పృథ్వీరాజ్కు స్టార్ హీరో మమ్ముట్టి అండగా ఉండటం తనను కదిలించిందని తెలిపారు. తన కొడుకుకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
News April 7, 2025
STOCK MARKETS: రూ.19 లక్షల కోట్ల నష్టం!

భారత స్టాక్ మార్కెట్స్ సెషన్ ప్రారంభంలోనే సుమారు రూ.19 లక్షల కోట్లు కోల్పోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 3939, నిఫ్టీ 1160 పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. 2020 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. మొత్తంగా 5 శాతానికి పైగా సంపద ఆవిరైంది. ఐటీ, మెటల్ సూచీలు 7 శాతం నష్టపోయాయి. మరోవైపు చైనా, జపాన్, కొరియా తదితర దేశాల మార్కెట్లు సైతం కుప్పకూలాయి.