News January 17, 2025
అలా చేస్తే నిర్మాతలకు బర్డెన్: అనిల్ రావిపూడి

సినిమా చిత్రీకరణపై డైరెక్టర్ అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క మూవీని 3-5 నెలల్లో పూర్తిచేస్తానని తెలిపారు. ‘రోజుకు రూ.20-25 లక్షలు ఖర్చు అవుతాయి. అందుకే సినిమాటోగ్రాఫర్‌కు ముందే హైలైట్స్ ఏవో చెప్తా. క్వాలిటీ కోసం ఏంకావాలో అదే చేయండని సూచిస్తా. సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా 70 రోజుల్లో పూర్తిచేశా. ఎక్కువ రోజులు తీస్తే ప్రొడ్యూసర్‌కు ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది’ అని తెలిపారు.
Similar News
News February 9, 2025
క్రమశిక్షణ తప్పినవారిని ఉపేక్షించం: తుమ్మల

TG: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తప్పినవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కష్టపడే కార్యకర్తలకే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల్లో ప్రజామోదం ఉన్న నేతలకే అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి’ అని ఆయన పేర్కొన్నారు.
News February 9, 2025
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు

*షాహిద్ అఫ్రిదీ- 351 సిక్సర్లు (369 ఇన్నింగ్సులు)
*రోహిత్ శర్మ- 334 (259)
*క్రిస్ గేల్- 331 (294)
*జయసూర్య- 270 (433)
*ధోనీ- 229 (297)
*మోర్గాన్- 220 (230)
*డివిలియర్స్- 204 (218)
*మెక్‌కల్లమ్- 200 (228)
*సచిన్- 195 (452)
News February 9, 2025
నక్సలిజాన్ని పూర్తిగా పెకిలిస్తాం: అమిత్ షా

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా పెకిలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. ‘ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోలు మరణించారు. ఈ పోరులో ఇద్దరు జవాన్లను కోల్పోయాం. వీరికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఇకపై దేశంలో ఏ పౌరుడూ నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోకూడదు’ అని ఆయన పేర్కొన్నారు.