News November 30, 2024

అలా చేస్తే యుద్ధంలో కీలక దశను ఆపేస్తాం: జెలెన్ స్కీ

image

తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను నాటో కిందికి తీసుకొస్తే రష్యాతో యుద్ధంలో కీలక దశను ఆపేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్ మొత్తానికి నాటో మెంబర్‌షిప్ ఇవ్వాలని, ముందుగా అంతర్జాతీయ సరిహద్దు భూభాగాలకు నాటో భద్రత కల్పించాలన్నారు. అలా చేస్తే ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న భూభాగాలను దౌత్యమార్గంలో తిరిగి పొందడానికి చర్చలు జరుపుతామన్నారు. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చని చెప్పారు.

Similar News

News December 7, 2024

‘పుష్ప-2’ను అతను కూడా డైరెక్ట్ చేశారు: సుకుమార్

image

పుష్ప సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు రాజమౌళి అని సుకుమార్ అన్నారు. ‘పుష్ప-2’ను హిందీలో రిలీజ్ చేయాలని జక్కన్న పట్టుబట్టారని చెప్పారు. ’పుష్ప-2’లో చైల్డ్ హుడ్ సీన్, ట్రక్ సీన్‌తో పాటు 40 శాతం సినిమాను తన అసిస్టెంట్ శ్రీమన్ డైరెక్ట్ చేశారన్నారు. మూవీకి డైరెక్టెడ్ బై సుకుమార్, శ్రీమన్ అని వేయాల్సి ఉందని తెలిపారు. తన టీమ్‌లో అందరూ సుకుమార్‌లేనని పేర్కొన్నారు.

News December 7, 2024

మాయలఫకీర్‌లా రేవంత్ డ్రామాలు: జేపీ నడ్డా

image

TG: రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. సరూర్ నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మాయలఫకీర్‌లా రేవంత్ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హామీల అమలులోనూ రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి అని మండిపడ్డారు.

News December 7, 2024

3వ క్వార్టర్‌లో పుంజుకుంటాం: FM నిర్మల

image

సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ గణాంకాలు క్షీణించ‌డం వ్యవస్థాగత మందగమనాన్ని సూచించవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు. 3వ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని రాబోయే రోజుల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజా, మూలధన వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల 2వ త్రైమాసికంలో అభివృద్ధి మందగించింద‌న్నారు.