News October 25, 2024
వర్కౌట్లు ఎక్కువగా చేస్తున్నారా?

ఎక్కువగా వర్కౌట్లు చేసేవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అతిగా వ్యాయామం చేస్తే సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందంటున్నారు. ‘ఒకవేళ స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉన్నా అవి యాక్టివ్‌గా ఉండవు. వర్కౌట్ల సమయంలో టైట్ దుస్తులు ధరించడం వల్ల వేడి ఎక్కువై ఇన్‌ఫెర్టిలిటీ సమస్య పెరిగింది’ అని పేర్కొంటున్నారు. వదులు దుస్తులతో వర్కౌట్లు చేస్తే శుక్ర కణాల నాణ్యత పెరిగినట్లు తెలిపారు.
Similar News
News March 18, 2025
నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

TG: ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. నిన్న ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
News March 18, 2025
టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.
News March 18, 2025
నెలకు రూ.5,000.. UPDATE

యువతకు నైపుణ్యాన్ని అందించి ఉపాధి కల్పనే లక్ష్యంగా తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి కేంద్రం ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రారంభించారు. యువతను ఇందులో భారీగా చేరేలా ప్రోత్సహించాలని MPలకు సూచించారు. ఇంటర్న్‌కు ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు రూ.5వేలు ఇవ్వనున్నారు. ఈ పథకం <<15723056>>రెండో దశ దరఖాస్తు గడువును<<>> కేంద్రం ఈ నెల 31 వరకు పొడిగించింది.