News March 18, 2025

‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం: మంత్రి

image

AP: గతేడాది విజయవాడను ముంచేసిన బుడమేరు వాగుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు ప్రారంభించామని మంత్రి నిమ్మల తెలిపారు. ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నిధుల విడుదలకు మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు సరస్సు వరకు కాలువల ప్రవాహ మార్గం సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచుతామన్నారు.

Similar News

News April 22, 2025

తప్పు చేసినవారిపై చర్యలు తప్పవు: సీఎం సిద్దరామయ్య

image

కర్ణాటకలో ‘వింగ్ కమాండర్‌పై దాడి’ కేసులో దోషులపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య స్పష్టం చేశారు. ‘కన్నడిగులు మాతృభాష పట్ల గర్విస్తారు. అలా అని ఇతర భాషల్ని ద్వేషించరు. దాడులు చేయరు. మాది అంతటి కుంచిత మనస్తత్వం కాదు. జాతీయ మీడియా మా గౌరవాన్ని దిగజార్చేలా వార్తలు వ్యాప్తి చేయడం దురదృష్టకరం. ఘటనపై సమగ్ర విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఆదేశించాను’ అని తెలిపారు.

News April 22, 2025

ఆ దేశంలో చాలా సేఫ్టీ.. అందుకే ఇల్లు కొన్నా: సైఫ్

image

ఖతార్‌లో తనకు చాలా సేఫ్టీగా అనిపించిందని, అందుకే అక్కడ ఓ ఇల్లు కొన్నానని నటుడు సైఫ్ అలీ ఖాన్ అన్నారు. త్వరలోనే తన కుటుంబానికి ఆ ఇల్లు చూపిస్తానని తెలిపారు. ‘నేను ఖతార్‌లో ఇల్లు కొనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముంబై నుంచి అక్కడికి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఖతార్ వాతావరణం అద్భుతంగా ఉంటుంది.’ అని చెప్పారు. ఇటీవల సైఫ్‌పై హత్యాయత్నం జరిగిన క్రమంలో ఆయన అక్కడ ఇల్లు కొనడం చర్చనీయాంశంగా మారింది.

News April 22, 2025

విపత్తులతో ఏ ఒక్కరూ చనిపోకూడదు: అనిత

image

AP: ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరి ప్రాణాలు పోవడానికి వీల్లేదని హోంమంత్రి అనిత అన్నారు. దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ‘గత ప్రభుత్వం వంతెనలు, డ్రైనేజీలు, సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో విపత్తులు సంభవిస్తున్నాయి. ఇకపై ఇలాంటివి సంభవించకుండా జాగ్రత్త పడతాం’ అని ఆమె వ్యాఖ్యానించారు.

error: Content is protected !!