News January 31, 2025

డాల్ఫిన్లకూ సొంతంగా పేర్లుంటాయ్..!

image

మనుషులకు ఉన్నట్లే డాల్ఫిన్‌లకూ సొంతంగా పేర్లుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ఎంతో తెలివైన సముద్ర జీవులని, ఒకదానినొకటి పిలుచుకునేందుకు ప్రత్యేకమైన ఈలలు ఉపయోగిస్తాయని అంటున్నారు. డాల్ఫిన్‌లు వాటి ప్రత్యేక విజిల్‌కి మాత్రమే ప్రతిస్పందిస్తాయని కనుగొన్నారు. కొన్ని 60 ఏళ్ల వరకూ జీవిస్తాయి. ఉత్తర జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కాలిఫోర్నియా, చిలీ వంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

Similar News

News February 14, 2025

యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం

image

AP: అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై జరిగిన <<15457778>>యాసిడ్ దాడి<<>> ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

News February 14, 2025

మద్యం తాగేవాళ్లలో తెలంగాణ వారే టాప్

image

సౌత్ ఇండియాలో TGలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని రాజ్యసభలో మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. అదే సమయంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని తెలిపారు. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం APలో 34.9%, TGలో 53.8% మంది పురుషులు మద్యం సేవించేవారని వివరించారు. 2019-21 నాటికి ఇది APలో 31.2%, TGలో 50శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.

News February 14, 2025

దారుణం.. బుల్లెట్ బైక్ నడిపాడని చేతులు నరికేశారు

image

తమిళనాడులో దారుణం జరిగింది. శివగంగ జిల్లాకు చెందిన దళిత విద్యార్థి అయ్యసామి డిగ్రీ చదువుతున్నారు. ఇటీవల తనకిష్టమైన బుల్లెట్ బైకుపై కాలేజీకి వెళ్లొస్తుండగా ముగ్గురు అగ్రవర్ణ యువకులు అతడిపై దాడి చేశారు. ‘కులం తక్కువవాడివి.. మా ముందే బండెక్కుతావా, నీకు బుల్లెట్ కావాలా?’ అని కత్తులతో రెండు చేతులను నరికేశారు. అంతటితో ఆగకుండా సామి ఇంటినీ ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

error: Content is protected !!