News November 14, 2024

ప్రధాని మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం

image

ప్రధాని మోదీకి డొమినికా తమ దేశంలోని అత్యున్నత పురస్కారం ‘ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రకటించింది. కొవిడ్-19 సమయంలో తమ దేశానికి భారత్ నుంచి అందిన సాయానికి కృతజ్ఞతగా, ఇరు దేశాల మధ్య బంధం బలోపేతానికి ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు వివరించింది. వచ్చే వారం గయానాలోని జార్జ్ టౌన్‌లో జరిగే ఇండియా-కారికామ్ సదస్సులో డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనున్నారు.

Similar News

News February 12, 2026

కోత అనంతరం అరటిని ఆశించే తెగుళ్లు- జాగ్రత్తలు

image

కోత అనంతరం నిల్వ దశలో ఉన్న అరటిలో ఆంత్రాక్నోస్ (కాయలపై మచ్చలు), హస్త మొదలు కుళ్లు, కాయ మచ్చిక కుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి నివారణకు అరటి హస్తాలను కత్తిరించిన వెంటనే ఒక శాతం పొటాషియం, అల్యూమినియం, సల్ఫేట్ (ఆలమే) ద్రావణంలో ముంచి ఆరిన తరువాత 150 గేజ్ (సుమారు 37.5 మైక్రాన్లు) మందం కలిగిన పాలిథిన్ సంచులలో నిల్వ చేసుకోవాలని ఉద్యానవన నిపుణులు సూచిస్తున్నారు.

News February 12, 2026

HURLలో 40 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<>HURL<<>>) 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BSc(అగ్రి), MSc, BTech, MBA/PGDBM, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజినీర్‌‌ పే స్కేల్ రూ.40K -రూ.1.40L, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50K-రూ.1.60L, Jr. Engg. అసిస్టెంట్‌కు రూ.25k-రూ.86,400 ఉంది. సైట్: hurl.net.in/

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘నీలకంఠ’’

image

క్షీరసాగరాన్ని చిలికేటప్పుడు హాలాహలం ఉద్భవించింది. ఆ ప్రాణాంతక విషం నుంచి సృష్టిని రక్షించడానికి శివుడు దానిని స్వీకరించాడు. అయితే ఆ విషం కడుపులోకి వెళ్తే ఆయనలోని సకల జీవరాశికి ముప్పు కలుగుతుందని పార్వతీ దేవి ఆయన గంఠాన్ని గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ విషం గొంతులోనే ఆగిపోయింది. అది నీలం రంగులోకి మారింది. లోక రక్షణ కోసం విషాన్ని సైతం భరించిన త్యాగమూర్తి కాబట్టే ఆయనకు ‘నీలకంఠుడు’ అనే పేరు వచ్చింది.