News September 8, 2024
రేపు 400 గ్రామాలకు రూ.లక్ష చొప్పున విరాళం: నాదెండ్ల
AP: వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు ₹లక్ష చొప్పున రేపు విరాళం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పంచాయతీలను ఆదుకునేందుకు dy.cm పవన్ సొంత నిధుల నుంచి ₹4 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, కూటమి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని సూచించారు.
Similar News
News October 9, 2024
గత ముఖ్యమంత్రి నిరుద్యోగులను పట్టించుకోలేదు: సీఎం రేవంత్
TG: తమ ప్రభుత్వం 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామకపత్రాలు అందజేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కానీ గత ముఖ్యమంత్రి వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. తాము 65 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామన్నారు.
News October 9, 2024
హరియాణా, ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకటే: జగన్
AP: హరియాణా ఎన్నికలు కూడా AP తరహాలోనే జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందిన US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోనే బ్యాలెట్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. మనం కూడా అదే విధానానికి వెళ్లడం మంచిది. ఓటర్లలో విశ్వాసం నింపేందుకు న్యాయనిపుణులు ముందుకు రావాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
News October 9, 2024
జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈనెల 14న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. అత్యాచారం కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.