News March 12, 2025
రూ.2,200 కోట్లు దాటిన విరాళాలు: TTD ఛైర్మన్

AP: టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ విరాళాలు రూ.2,200 కోట్లు దాటినట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. 1985లో నాటి CM ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. నేడు రోజుకు లక్ష మంది భక్తులకు అన్నవితరణ చేసే స్థాయికి వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. 9.7 లక్షల దాతలను ఈ ట్రస్ట్ కలిగి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రుచిగా, శుచిగా అన్నప్రసాద వితరణ చేస్తోందని చెప్పారు.
Similar News
News March 24, 2025
విశాఖలో IPL మ్యాచ్.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మ.2 నుంచి రాత్రి 12 గంటల వరకు మధురవాడ స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా దారి మళ్లించారు.
News March 24, 2025
పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. అక్కడ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ వీటిని ఏర్పాటు చేసింది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని AP సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు TDP ఎంపీలు కోరగా లోక్‌సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
News March 24, 2025
కాస్త తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.82,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గడంతో రూ.89,620కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,09,900గా ఉంది. కాగా, మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.1040 తగ్గడం గమనార్హం.