News March 25, 2024
పార్సిల్స్ పేరిట ఫోన్ వస్తే స్పందించొద్దు: సజ్జనార్

TS: పోలీసులమంటూ ఫోన్ చేసి మీ పేరిట డ్రగ్ పార్సిల్ వచ్చిందని బెదిరిస్తూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ‘మోసగాళ్ల ట్రాప్‌లో ఐఐటీలో చదివిన వ్యక్తి కూడా మోసపోయారు. అతని వద్ద రూ.30 లక్షలు దోచేశారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. పార్సిల్స్ పేరుతో ఫోన్ వస్తే స్పందించవద్దు. వ్యక్తిగత వివరాలను చెప్పొద్దు. మోసపోతే 1930కి వెంటనే ఫోన్ చేయండి’ అని తెలిపారు.
Similar News
News February 3, 2026
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్

AP: మాజీ CM, YCP అధ్యక్షుడు జగన్ రేపు గుంటూరులో పర్యటించనున్నారు. CM చంద్రబాబుపై అనుచిత వాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ సహా ఆయన కుటుంబాన్ని జగన్ కలవనున్నారు. TDP శ్రేణుల దాడిలో దెబ్బతిన్న రమేశ్ ఇంటిని పరిశీలిస్తారు. ఈ మేరకు YCP MLC తలశిల రఘురామ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
News February 3, 2026
వ్యవసాయంలో అధిక ఆదాయం ఇలా సాధ్యం

సాగులో సమీకృత వ్యవసాయంతో అధిక ఆదాయం సాధ్యమంటున్నారు నిపుణులు. భూమిని భాగాలుగా విభజించి వరి, చిరు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూనే.. కోళ్లు, గొర్రెలు, మేకలు, పాడి పశువులు, చేపల పెంపకాన్ని చేపట్టడాన్నే సమీకృత వ్యవసాయం అంటారు. దీని వల్ల కొద్దిపాటి భూమిలోనే ఏడాది పొడవునా రైతులు ఆదాయం పొందవచ్చు. దీన్ని ఎలా చేయాలి? ఏ భూములకు అనుకూలమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 3, 2026
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు

TG: మున్సి పల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాపై సాయంత్రం క్లారిటీ రానుంది. రెబల్స్‌ను బుజ్జగించే పనిలో 3 పార్టీల (కాంగ్రెస్, BRS, BJP) అగ్రనేతలు నిమగ్నమయ్యారని సమాచారం. పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు.


