News March 25, 2024

పార్సిల్స్ పేరిట ఫోన్ వస్తే స్పందించొద్దు: సజ్జనార్

image

TS: పోలీసులమంటూ ఫోన్ చేసి మీ పేరిట డ్రగ్ పార్సిల్ వచ్చిందని బెదిరిస్తూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ‘మోసగాళ్ల ట్రాప్‌లో ఐఐటీలో చదివిన వ్యక్తి కూడా మోసపోయారు. అతని వద్ద రూ.30 లక్షలు దోచేశారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. పార్సిల్స్ పేరుతో ఫోన్ వస్తే స్పందించవద్దు. వ్యక్తిగత వివరాలను చెప్పొద్దు. మోసపోతే 1930కి వెంటనే ఫోన్ చేయండి’ అని తెలిపారు.

Similar News

News November 3, 2024

కాబోయే జంటకు ఎన్టీఆర్ విషెస్

image

తన బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం ఫొటోలను Jr.NTR ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నితిన్-శివాని మీకు కంగ్రాట్స్. జీవితాంతం మీరిద్దరూ సుఖసంతోషాలతో కలిసుండాలి’ అంటూ విషెస్ తెలియజేశారు. నూతన వధూవరులతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఫొటోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

News November 3, 2024

RC16 షూటింగ్ ఎప్పటి నుంచంటే?

image

‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. మైసూరులో షూటింగ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

News November 3, 2024

ALERT.. రేపు వర్షాలు

image

APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ పలుచోట్ల వర్షాలు పడ్డాయి.