News September 25, 2024

AIతో భయం వద్దు: OpenAI CEO ఆల్ట్‌మాన్

image

జాబ్ మార్కెట్‌పై AI ప్రభావం చూపుతుందని న‌మ్ముతున్నట్టు OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పేర్కొన్నారు. అయితే కొంతమంది భయపడినంత త్వరగా లేదా తీవ్రంగా ప్ర‌భావం చూప‌బోద‌న్నారు. ఆకస్మికంగా ఉద్యోగాలేమీ పోవన్నారు. AI కార్మిక మార్కెట్లను సానుకూలంగా, ప్రతికూలంగా మార్చగలదని ఓ బ్లాగ్ పోస్ట్‌లో పంచుకున్నారు. అనుకున్నదానికంటే నెమ్మదిగా ఉద్యోగాల తీరు మారుతుందని, మనం చేయాల్సిన పనులు అయిపోతాయనే భయం లేదని పేర్కొన్నారు.

Similar News

News October 10, 2024

ఈనెల 13 నుంచి రాష్ట్రపతి ఆఫ్రికా పర్యటన

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 13 నుంచి ఆఫ్రికాలోని అల్జీరియా, మౌరిటానియా, మలావిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేస్తారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. రాష్ట్రపతి పర్యటన భారత్-ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించింది. పర్యటనలో భాగంగా ముర్ము ఆఫ్రికాలోని ప్రవాస భారతీయులను కలవనున్నారు.

News October 10, 2024

‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం

image

AP: అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. మీసేవ, గ్రామ-వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News October 10, 2024

రతన్ టాటా అందుకున్న పురస్కారాలు

image

రతన్ టాటా తన జీవిత కాలంలో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ అనేక గౌరవ పురస్కారాలను అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ఠ సాఫల్య పురస్కారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ గ్రాండ్ ఆఫీసర్ అవార్డు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(UK), ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి అవార్డులు, అనేక డాక్టరేట్లు తన ఖాతాలో ఉన్నాయి.