News December 30, 2024
కాసులకు కక్కుర్తి పడొద్దు.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు సజ్జనార్ సూచన
TG: డబ్బుల కోసం కక్కుర్తి పడి ఎంతోమందిని బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేయొద్దని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు RTC MD సజ్జనార్ సూచించారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సొంత లాభం కోసం ప్రజా శ్రేయస్సును విస్మరించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. సంఘ విద్రోహశక్తులకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
Similar News
News January 14, 2025
గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000!
రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే ఇచ్చే రివార్డును కేంద్రం పెంచనుంది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే ₹5వేలను ₹25వేలకు పెంచుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గాయపడ్డ గంటలో చికిత్స అందితే బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువ. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. కేసులు, తదితర భయాలతో క్షతగాత్రులను చాలామంది ఆస్పత్రులకు తీసుకెళ్లట్లేదు.
News January 14, 2025
రైతులకు గుడ్ న్యూస్.. కూరగాయల సాగుకు సబ్సిడీ!
TG: కూరగాయలు సాగు చేసే రైతులు శాశ్వత పందిళ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాశ్వత పందిళ్లకు ఎకరానికి ₹3లక్షలు ఖర్చు కానుండగా, అందులో 50% సబ్సిడీ ఇవ్వనుంది. ఈ స్కీమ్‌ను తొలుత NZB(D) బోధన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. తీగ జాతి కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ స్కీమ్ అమలుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను వినియోగించనున్నట్లు సమాచారం.
News January 14, 2025
టిక్‌టాక్‌ను మస్క్‌కు అమ్మనున్న చైనా?
అమెరికాలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తే ఏం చేయాలన్న దానిపై బైట్‌డాన్స్ మల్లగుల్లాలు పడుతోంది. ఆ దేశం వరకు వ్యాపారాన్ని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్‌కు అమ్మడాన్ని ఒక ఆప్షన్‌గా ఎంచుకున్నట్టు తెలిసింది. విషయం అంత వరకు రాకుండా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌తో చర్చించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. వారెలాంటి రూల్స్ పెట్టినా పాటించేందుకు సై అంటోంది. టిక్‌టాక్ బ్యాన్‌కు ట్రంప్ అనుకూలంగా ఉండటం గమనార్హం.