News June 18, 2024

ఉద్యోగుల మార్పిడి ప్రచారాన్ని నమ్మకండి: ప్రభుత్వం

image

TG: ఏపీ నుంచి ఉద్యోగులు తెలంగాణలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. రాష్ట్ర విభజన సమయంలో కొందరు TG ఉద్యోగులను ఏపీకి, ఏపీ వారిని TGకి కేటాయించారు. అప్పటి నుంచి వారు బదిలీలు కోరుతున్నారు. ఈ అంశం ఏళ్లుగా నానుతోంది. తాజాగా కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వం కేవలం ఉద్యోగుల మార్పిడి సమాచారం సేకరించింది. దీంతో ఏపీ నుంచి ఉద్యోగులు TGలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది.

Similar News

News January 18, 2026

పితృ దేవతల అనుగ్రహం కోసం ఇలా చేయండి!

image

పితృ దోషాలు, పూర్వీకుల అనుగ్రహం పొందేందుకు మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యమైందని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి నదీ స్నానం ఆచరించాలి. ఉపవాసం ఉంటూ, మౌనవ్రతం పాటించాలి. జాతకంలో పితృ దోషాలు ఉన్నవారు నల్ల నువ్వులతో తర్పణం వదలాలి. పేదలకు అన్నదానం, వస్త్ర దానం, పెరుగు దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. పండితుడికి బూడిద గుమ్మడికాయ దానం చేయడం మంచిది’ అని సూచిస్తున్నారు.

News January 18, 2026

డెయిరీఫామ్ కోసం పశువులను కొంటున్నారా?

image

డెయిరీఫామ్ నిర్వహణలో భాగంగా ఆవులు, గేదెలను కొనుగోలు చేసి పాడి రైతులు, పెంపకందారులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్తుంటారు. ఇలా తరలించేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. లేకుంటే వాటి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని పత్రాలను కూడా కొనుగోలుదారులు కలిగి ఉండాలి. ఆ పత్రాల వివరాలు, జీవాల తరలింపులో జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News January 18, 2026

అంగన్‌వాడీల్లో అల్పాహారం.. వచ్చే నెలలో ప్రారంభం

image

TG: అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టీజీ ఫుడ్స్ ద్వారా కిచిడీ, ఉప్మా వంటి టిఫిన్స్‌ను పిల్లలకు అందించనుంది. తొలుత హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల పరిధిలో ఉన్న 970 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లోటుపాట్లను సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా 35,781 కేంద్రాల్లో అమలు చేయనున్నట్లు సమాచారం.