News November 24, 2024
క్యాన్సర్‌పై సిద్ధూ వ్యాఖ్యలను నమ్మకండి: టాటా మెమోరియల్ హాస్పిటల్
డైట్ కంట్రోల్ వల్ల తన భార్యకు స్టేజ్-4 <<14676790>>క్యాన్సర్<<>> నయమైందన్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కామెంట్స్‌పై టాటా మెమోరియల్ ఆసుపత్రి స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా నమ్మొద్దని క్యాన్సర్ పేషెంట్లకు సూచించింది. ‘పసుపు, వేపాకు తినడం వల్ల క్యాన్సర్‌ను జయించొచ్చన్నది సరికాదు. దీన్ని నమ్మి వైద్యం తీసుకోవడం మానొద్దు. ఎలాంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించాలి’ అని కోరింది.
Similar News
News November 24, 2024
వర్కౌట్ కాని BJP ‘బంటీ ఔర్ బబ్లీ’ అస్త్రం!
ఝార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచారంలో BJP ‘బంటీ ఔర్ బబ్లీ’ అని సెటైర్లు వేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోరెన్ జైలుకెళ్లడంతో ఇద్దరూ ‘తోడు దొంగలు’ అనే అర్థం వచ్చేలా BJP పదేపదే ఈ కామెంట్స్ చేస్తూ వచ్చింది. ‘బంటీ ఔర్ బబ్లీ’ అనేది బాలీవుడ్ సినిమా టైటిల్. అయితే BJP ప్రయోగించిన ఈ అస్త్రం ఫలించలేదు. సోరెన్ పార్టీ JMM ఘన విజయం సాధించింది.
News November 24, 2024
భారీ స్కోర్‌పై భారత్ కన్ను
BGTలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు 2వ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుపై భారత్ కన్నేసింది. జైస్వాల్(90), KL రాహుల్(62) రాణింపుతో 172/0తో పటిష్ఠమైన స్థితిలో రెండో రోజు ఆట ముగించింది. ప్రస్తుతం 218 లీడ్‌లో ఉన్న భారత్ 3వ రోజంతా బ్యాటింగ్ చేసి కంగారూల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆసీస్‌పై ఒత్తిడి పెరిగే ఛాన్సుంది. మరి భారత్ ఎంత స్కోర్ కొడుతుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.
News November 24, 2024
CM కుర్చీ కోసం ‘ముగ్గురు మొనగాళ్లు’
మహారాష్ట్రలో BJP నేతృత్వంలోని మహాయుతికి 230 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కూటమిలోని BJP 149 స్థానాల్లో పోటీ చేయగా 132 గెలిచింది. శివసేన 81లో 57, NCP 59లో 41 గెలిచింది. కాగా తమ నేత ఫడణవీస్ CM కావడం పక్కా అని BJP అంటుంటే, శిండే నేతృత్వంలోని శివసేన సైతం CM విషయంలో తగ్గేదేలే అంటోంది. అటు NCP అజిత్ పవార్ కూడా CM కుర్చీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు.