News November 24, 2024
క్యాన్సర్‌పై సిద్ధూ వ్యాఖ్యలను నమ్మకండి: టాటా మెమోరియల్ హాస్పిటల్
డైట్ కంట్రోల్ వల్ల తన భార్యకు స్టేజ్-4 <<14676790>>క్యాన్సర్<<>> నయమైందన్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కామెంట్స్‌పై టాటా మెమోరియల్ ఆసుపత్రి స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా నమ్మొద్దని క్యాన్సర్ పేషెంట్లకు సూచించింది. ‘పసుపు, వేపాకు తినడం వల్ల క్యాన్సర్‌ను జయించొచ్చన్నది సరికాదు. దీన్ని నమ్మి వైద్యం తీసుకోవడం మానొద్దు. ఎలాంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించాలి’ అని కోరింది.
Similar News
News December 2, 2024
CM రేవంత్‌పై హరీశ్‌రావు విమర్శలు
TG: గతంలో మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు తాను సీఎం అయ్యాక ఉన్న రైతుబంధు కూడా ఇవ్వట్లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో BRS సర్వే చేస్తే రేవంత్ విమర్శించారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సర్వే ఎలా ఉందో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి పండుగపూట మహిళలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.
News December 2, 2024
కన్నడ నటి సూసైడ్ నోట్‌లో ఏముందంటే?
కన్నడ నటి <<14762879>>శోభిత<<>> మృతిపై బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘మీరు చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్’ అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా? భర్తతో విభేదాలా? లేక యాక్టింగ్‌కు దూరంగా ఉండటమా?అనే కోణాల్లో విచారిస్తున్నారు. నిన్న గచ్చిబౌలి శ్రీరామ్‌నగర్ కాలనీలో నటి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
News December 2, 2024
భారీ వర్షాలు, వరదలు.. గర్భిణులకు అండగా వైద్యులు!
‘ఫెంగల్’ తుఫాను కారణంగా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీటిలో చిక్కుకుని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ వైద్య సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టినట్లు అధికారులు తెలిపారు. బలమైన గాలులు, వర్షాల్లోనూ అక్కడి వైద్యులు నవంబర్ 30న రాష్ట్రంలో 1,526 మందికి సురక్షితంగా డెలివరీ చేసినట్లు వెల్లడించారు. గర్భిణులకు ఔషధాలు సైతం అందిస్తున్నామన్నారు.