News December 11, 2024

నన్ను అలా పిలవొద్దు.. అభిమానులకు హీరో విజ్ఞప్తి

image

తమిళ స్టార్ హీరో అజిత్ తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. తనను ‘కడవులే.. అజితే’ అని పిలవడం ఇబ్బందిగా ఉందన్నారు. అలా పిలవడం ఆపేయాలని ఆయన ఫ్యాన్స్‌ను కోరారు. తన పేరు ముందు ఎలాంటి పదాలు పెట్టి పిలవొద్దన్నారు. ఈ మేరకు ఆయన టీమ్ ప్రకటన విడుదల చేసింది. కాగా ‘కడవులే’ అంటే తమిళంలో దేవుడని అర్థం.

Similar News

News January 16, 2025

‘దబిడి దిబిడి’ స్టెప్పులపై విమర్శలు.. ఊర్వశి ఏమన్నారంటే?

image

‘డాకు మహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ పాటలో డాన్స్ స్టెప్పులపై విమర్శలు రావడంపై నటి ఊర్వశీ రౌతేలా స్పందించారు. ‘లైఫ్‌లో ఏం సాధించలేని కొందరు ఇలానే ట్రోల్ చేస్తుంటారు. వాళ్లు తమకు ఆ అర్హత ఉందనుకోవడం విడ్డూరం. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో పని చేసే అవకాశం దక్కడం నాకు దక్కిన గౌరవం. ఆయనతో పని చేయాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఆ డాన్స్ స్టెప్పులన్నీ కళలో భాగం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News January 16, 2025

శ్రీవారి భక్తులకు అలర్ట్

image

తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీపై అప్డేట్ వచ్చింది. ఈనెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఏప్రిల్ నెల అకామొడేషన్ కోటా బుకింగ్స్ కూడా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.

News January 16, 2025

సంక్రాంతి సీజన్‌లో తొలిసారి.. అన్నీ రూ.100 కోట్ల క్లబ్‌లోనే!

image

సంక్రాంతి బరిలో నిలిచే అన్ని సినిమాలు హిట్‌ అవ్వవు. అలాగే కలెక్షన్లూ రాబట్టలేవు. కానీ, ఈ ఏడాది విడుదలైన సంక్రాంతి సినిమాల్లో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలు ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా నేడు వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఆ మార్క్ దాటనుంది. ఇలా సంక్రాంతి సీజన్‌లో అన్ని మూవీస్ రూ.100 కోట్ల మార్క్‌ను దాటడం మొదటిసారి కానుందని సినీవర్గాలు తెలిపాయి.