News April 16, 2025
కోనోకార్పస్ చెట్లను నరకొద్దు: శాస్త్రవేత్తలు

కోనోకార్పస్ చెట్లపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాటిని రక్షించాలంటూ ప్రముఖ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. అపోహలు నమ్మి చెట్లను నరకొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ చెట్లు అత్యధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయని YVU మాజీ VC ప్రొ.ఏఆర్ రెడ్డి తెలిపారు. తక్కువ నీరు, నిర్వహణ లేకుండానే ఈ మొక్కలు బతుకుతాయని, హైవేలపై విరివిగా నాటాలని సూచించారు. ఈ చెట్లు భూగర్భ జలాలను అత్యధికంగా తీసుకుంటాయనేది అవాస్తవమని చెప్పారు.
Similar News
News April 24, 2025
ఇది భారత్‌పై దాడి: ప్రధాని మోదీ

పహల్‌గామ్‌లో పర్యాటకులపై దాడిని భారత్‌పై దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని మోదీ గుర్తు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆప్తులను కోల్పోయినవారికి న్యాయం చేయడానికి అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.
News April 24, 2025
ఉపాధి హామీ.. ‘కూలీ’ అనే పదం వాడొద్దు: పవన్

AP: ఉపాధి హామీ పథకంలో 75లక్షల మందికి పైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని అన్నారు. మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు.
News April 24, 2025
పాకిస్థానీ అంటూ ఆరోపణలు: స్పందించిన ప్రభాస్ హీరోయిన్

తాను పాకిస్థాన్ సంతతి యువతినంటూ వస్తున్న వార్తల్ని ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీ ఖండించారు. ‘నేను పాకిస్థానీ సైనికాధికారి కూతురినన్నది పచ్చిఅబద్ధం. ఆన్‌లైన్ ట్రోలర్లు ఆ విషయాన్ని వ్యాప్తి చేశారు. మా తల్లిదండ్రులు లాస్‌ఏంజిలిస్‌కు వలస వెళ్లారు. నేను అక్కడే పుట్టాను. హిందీ, తెలుగు, గుజరాత్, ఇంగ్లిష్ మాట్లాడే భారత సంతతి అమ్మాయిని నేను. ఈ బాధాకర సమయంలో ద్వేషాన్ని కాదు.. ప్రేమను వ్యాప్తి చేయండి’ అని కోరారు.