News January 3, 2025
పెళ్లికి ముందు ఆ పని చేయకండి: సింగర్ చిన్మయి
తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే సింగర్ చిన్మయి తాజాగా ఓ నెటిజన్‌పై మండిపడ్డారు. 31st రోజు తమ యాప్ ద్వారా లక్షకు పైగా కండోమ్స్ సేల్ చేసినట్లు బ్లింకిట్ ట్వీట్ చేసింది. దీనిపై సదరు నెటిజన్ ‘వర్జిన్ అమ్మాయిలు భార్యలుగా దొరకడం కష్టమే’ అని కామెంట్ చేశాడు. దీంతో ‘మగాళ్లు పెళ్లికి ముందు అమ్మాయిలతో సెక్స్ చేయడం ఆపండి. మీ అన్నదమ్ములు, ఫ్రెండ్స్‌కి ఆ పని చేయొద్దని చెప్పండి’ అని కౌంటర్ ఇచ్చారు.
Similar News
News January 23, 2025
ప్రచారంలో ఉన్న లిస్టు ఫైనల్ కాదు: మంత్రి ఉత్తమ్
TG: సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయమై ప్రచారంలో ఉన్న లిస్టు తుది జాబితాలు కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది వెరిఫికేషన్ మాత్రమేనని తెలిపారు. కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. చివరి లబ్ధిదారుడి వరకు రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ 40వేల రేషన్ కార్డులు ఇచ్చిందని దుయ్యబట్టారు.
News January 23, 2025
అక్బర్, ఔరంగజేబు గురించి మనకెందుకు: అక్షయ్ కుమార్
దేశంలో చరిత్ర పుస్తకాలను మార్చాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ హిస్టరీ బుక్స్‌లో అక్బర్, ఔరంగజేబు గురించి చదువుకోవడం అవసరమా అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన ‘స్కై ఫోర్స్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘చరిత్రలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల గురించి పాఠాలు ఉండాలి. పరమవీరచక్ర అవార్డు పొందిన వారి కథనాలు ప్రచురించాలి’ అని పేర్కొన్నారు.
News January 23, 2025
భార్యను ముక్కలుగా నరికిన భర్త.. కారణం ఇదే!
TG: జిల్లెలగూడలో మాధవి <<15230164>>హత్య కేసులో<<>> పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన మాధవి సంక్రాంతికి పుట్టింటికి వెళ్తానని అడగ్గా భర్త గురుమూర్తితో గొడవ జరిగిందని చెప్పారు. ఆ కారణంతోనే భార్యను చంపినట్లు భావిస్తున్నారు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి, కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. గురుమూర్తికి వేరే మహిళతో సంబంధం ఉందని కూడా అనుమానిస్తున్నారు.